పత్రికా విలేకరులపై రాళ్లతో దాడి

 

పత్రికా విలేఖరులపై రాళ్ళతో దాడి
*ప్రాణభయంతో పరుగులు *పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు
*దాడికి పాల్పడిన నిందితులను శిక్షించాలని, జర్నలిస్టుల రాస్తారోకో

వేములపల్లి, అక్షిత ప్రతినిధి :

వేములపల్లి మండలంలో పనిచేస్తున్న ఇద్దరు విలేకరులపై యాదవులు దాడి చేసిన సంఘటన శనివారం మండలంలోని బుగ్గబాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పత్రికా విలేకరులకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తామని పలుమార్లు శాసనసభ సమావేశాల్లో చెప్పిన విషయం అందరికి తెలిసిందే.వేములపల్లి మండలంలోని వివిధ దినపత్రికలకు చెందిన విలేకరులు తమకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని తహసిల్దార్ కు దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది. తహశీల్దారు మండల పరిధిలోని బుగ్గబాయి గూడెం గ్రామ పరిధిలో గంగమ్మ దేవాలయం ఎదురుగా రాళ్లతో కూడి ఉన్న గుట్టను విలేకరులకు కేటాయించడం జరిగింది.ఈనేపథ్యంలో మండల విలేకరులు తమకు కేటాయించిన స్థలాన్ని ప్రోక్లేయిన్ సహాయంతో గత మూడు రోజులుగా బాగు చేస్తున్నారు.ఈ క్రమంలో శనివారం ఉదయం సమయంలో ముగ్గురు విలేకరులు స్థలం వద్ద ఉండి పనులు చేయిస్తున్నారు. వివిధ గ్రామాల నుండి 150 మంది యాదవులు ఒక్కసారిగా అక్కడికి చేరుకొని ఈ స్థలం మా యాదవులది మీకు ఏం అధికారం ఉందని గుట్టను తవ్వుతున్నారని బూతుపదజలంతో తిడుతూ ముగ్గురు విలేకరులపై విచక్షణరహితంగా రాళ్లతో దాడి చేసి కులం పేరుతో మాదిగ నా కొడుకుల్లారా అంటూ దూషించడంతో పాటు ఓ విలేఖరిని పరుగులు పెట్టించి సుమారుగా రెండు కిలోమీటర్ల మేరకు వెంబడించి చంపుతామని బెదిరించడం జరిగింది. భయంభ్రాంతులకు గురైన విలేకరులు మండల పోలీస్ స్టేషన్ కి చేరుకొని అకారణంగా తమపై దాడి చేసిన నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.

*విలేకరులపై దాడికి పాల్పడిన నిందితులను శిక్షించాలి*

వేములపల్లి పత్రిక విలేకరులపై దాడికి పాల్పడిననిందితులను కఠినంగా శిక్షించాలని మిర్యాలగూడ నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్నటువంటి విలేకరులు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని రోడ్డుపై బేటాయించి రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విలేకరులకు ఇండ్లస్థలాలు కేటాయిస్తూ తహశీల్దార్ ఉత్తర్వులు జారీచేయగా ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తున్నటువంటి విలేకరులపై అకారణంగా దాడులకు పాల్పపడిన నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వివిధ జర్నలిస్టు సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking