*జర్నలిస్ట్స్ జహీర్ భాయ్* *అమర్ రహే*
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
ఇవ్వాళ నాంపల్లిలోని మదీనా ఎడ్యుకేషన్ బిల్డింగ్ ఆడిటోరియంలో జరిగిన సుప్రసిద్ధ పాత్రికేయులు, ప్రజాస్వామికవాది జహీర్ అలీ ఖాన్ సంస్మరణ సభ జరిగింది. పలువురు సీనియర్ జర్నలిస్టులు, ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాల బాధ్యులు ఈ
సభలో పాల్గొని నివాళి అర్పించారు.జర్నలిస్ట్ జహీర్ భాయ్ అమర్ రహే నినాదాలు సభలో మారుమ్రోగాయి. ఐజేయూ జాతీయ అధ్యక్షులు కే.శ్రీనివాస్ రెడ్డి, జాతీయ స్టీరింగ్ కమిటీ సభ్యులు దేవులపల్లి అమర్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీలు జహీర్ భాయ్ తో తమకున్న అనుబంధాన్ని నెమరేసుకున్నారు. టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం, సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి, ఎన్.వేణుగోపాల్, ప్రజా సంఘాల బాధ్యులు రమా మేల్కొటే, సజయ, వి.సంధ్య, జీవన్ కుమార్, విమల, టివివి అధ్యక్షులు నాగయ్య, హెచ్.యు.జె అధ్యక్షులు శిగా శంకర్ గౌడ్, టీయూడబ్ల్యూజే నాయకులు ఏ.రాజేష్ తదితరులతో పాటు జహీర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Prev Post