టియుడబ్ల్యుజే-ఐజేయూ మిర్యాలగూడ నియోజక వర్గ అధ్యక్షుడిగా గుడుగుంట్ల సుందర్, ప్రధాన కార్యదర్శిగా షేక్ మౌలాలి

* టియుడబ్ల్యుజే-ఐజేయూ మిర్యాలగూడ

నియోజక వర్గ అధ్యక్షుడిగా గుడుగుంట్ల సుందర్, ప్రధాన కార్యదర్శిగా షేక్ మౌలాలి

వేములపల్లి, అక్షిత ప్రతినిధి :

నల్లగొండ జిల్లా కేంద్రంలోని పీఆర్ టియు భవనంలో ఆదివారం జరిగిన తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయు జిల్లా సర్వసభ్య సమావేశంలో మిర్యాలగూడ నియోజకవర్గ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

*టియుడబ్ల్యుజే ఐజేయు మిర్యాలగూడ నియోజకవర్గ నూతన కార్యవర్గం*
అధ్యక్షుడిగా గుడుగుంట్ల సుందర్, ప్రధాన కార్యదర్శిగా షేక్ మౌలాలి, ఉపాధ్యక్షుడుగా ఆర్ కిషోర్, సహాయ కార్యదర్షులుగా బి.హేమంత్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, ఎస్ రామకృష్ణరాజు, కోశాధికారిగా పొదిల హరి, కార్యవర్గ సభ్యులుగా చక్రి, సోమయ్య, నర్సిరెడ్డి, జాని, సైదులు, మహమ్మద్ అఖిల్, దర్శనం రాంబాబు, ఎండి సమి, బండ వేణుగోపాల్ రెడ్డి, వల్లపుదాసు కిరణ్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిర్యాలగూడ టి యుడబ్ల్యుజే -ఐజేయు నియోజక వర్గ కమిటీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన గుడుగుంట్ల సుందర్, ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన షేక్.మౌలాలిలు మాట్లాడుతూ నియోజక వర్గపరిధిలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించేందుకు తమవంతు కృషి చేస్తామన్నారు. తమ నియామకాలకు సహకరించిన టియుడబ్ల్యుజే, ఐజేయు జాతీయ కమిటీ సభ్యులు మాతంగి దాస్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గార్లపాటి కృష్ణారెడ్డి , మారబోయిన మధుసూదన్, గౌరవ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, జిల్లా ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కలిమెల నాగయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు రంగా శ్రీనివాస్ లకు కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking