హామీలు ఘనం..అమలు శూన్యం..

హామీలు ఘనం..అమలు శూన్యం..
అటు మోడీ.. ఇటు కేసీఆర్ ఇద్దరూ ఇద్దరే

శేరిలింగంపల్లి, అక్షిత ప్రతినిధి :

శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రఘునాథ్ యాదవ్ మండిపడ్డారు
6వ రోజు శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తుల్జ భవాని టెంపుల్, తారానగర్, ఓల్డ్ లింగంపల్లి తదితర ప్రాంతాల్లో *హాత్ సే హాత్ జోడో యాత్ర నిర్వహించారు.ఈ సందర్బంగా పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ
అటు మోడీ ఇటు కేసీఆర్ ల హామీలు మాత్రం ఘనంగా ఉంటాయి.. కానీ అమలు చేయడం లో శూన్యమన్నారు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగిన వేడుకల్లో ఎన్నికల్లో మరోసారి అధికారం కోసం పాకులట ప్రసoగం తప్ప ప్రజలకు ఏమి చేయాలో.. చేస్తామని చెప్పక్కపోవడం విడ్డురంగా ఉందన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రూ. 500లకే పేదలకు వంట గ్యాస్ సిలిండర్ అందిస్తామని రాష్ట్ర నాయకులు రఘునాథ్ యాదవ్ వెల్లడించారు.కేజీ టు పీజీ ఉచిత, నాణ్యమైన ఇంగ్లిష్ మీడియం విద్య అందిస్తామని, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగులకు నెలకు రూ. 4 వేల చొప్పున భృతి సహా కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పెట్టిన 10 హామీలను వివరించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలకు ఇల్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షల చొప్పున ఇస్తామని శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రఘునాథ్ పేర్కొన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి, కేసీఆర్ మోసం చేశారని తాము అధికారంలో రాగానే రూ. 2 లక్షల చొప్పున రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ. 5 లక్షల వరకు వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ సినియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking