మౌలిక సౌకర్యాల కల్పన
పనులు చేపట్టాలి
కలెక్టర్ ఆర్ వి కర్ణన్
నల్గొండ, అక్షిత ప్రతినిధి :
నల్గొండ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో మౌలిక సౌకర్యాల కల్పనకు చేపట్టిన అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ తెలిపారు.బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మున్సిపాలిటీలలో సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ ల నిర్మాణం, మొక్కల పెంపకం, సంపద వనాలు, ఎస్టిపి, వైకుంఠధామం, ధోబిఘాట్, బస్తీ దావకాన, సిటీ బ్యూటిషన్, స్వచ్ఛ సర్వేక్షన్, లైబ్రరీ సెస్, టాయిలెట్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మున్సిపాలిటీలలో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. మిగతా పెండింగ్ పనులను గ్రౌండ్ పూర్తి చేసి టెండర్లు పిలవాలన్నారు. ముఖ్యంగా సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ లు, వైకుంఠధామాలు ప్రారంభించడానికి పనులు త్వరగా పూర్తి చేసేందుకు తీసుకోవాలన్నారు. పార్కులలో లైటింగ్ అందంగా తీర్చిదిద్దాలన్నారు.

సందర్శకులు ఎక్కువ మొత్తంలో వచ్చేలా వారం వారం ఈవెంట్స్ పెట్టాలన్నారు. అంతేగాక డాన్స్ ప్రోగ్రాలు నిర్వహించాలన్నారు. పార్కు బయట లోపల స్ట్రీట్ ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణ హరితహారం టార్గెట్ పూర్తి చేయాలన్నారు. తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ప్రభుత్వ స్కూల్స్, కాలేజీ గ్రౌండ్స్లలో ఏర్పాటు చేయాలన్నారు. డెంగ్యూ వస్తున్నందున మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఆరోగ్య నియమాలు స్థానిక బస్తీ దవాఖాన సిబ్బంది తో కలసి టీమ్ ల వారీగా పర్యటించాలని తెలిపారు. మునిసిపాలిటి వారు ఫాగింగ్ కచ్చితంగా చేయాలన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ మాట్లాడుతూ, ఏ మున్సిపాలిటీలో లో కూడా లైబ్రరీ సెస్ పెండింగ్లో ఉంచకూడదని , పెండింగ్ సెస్ వెంటనే చెల్లించాలన్నారు. ఇకనుండి ప్రతి నెల నెల సెస్ చెల్లించాలని సూచించారు. సెస్ విషయంలో రాజకీయ జోక్యం ఉండకూడదు అని తెలిపారు. అన్ని మున్సిపాలిటీలలో పారిశుధ్యం చేపట్టి ఎప్పటికప్పుడు పరిసరాలు శుభ్రంగా ఉంచాలని తెలిపారు. సిబ్బంది కొరత ఉంటే తక్షణమే డైలీ వేజ్ పై నియమించుకోవాలని సూచించారు. బడ్జెట్ వివరాలు, టాక్స్ కలెక్షన్ మున్సిపాలిటీల వారిగా అడిగి తెలుసుకున్నారు. మళ్లీ 15 రోజుల తర్వాత ఏర్పాటు చేసే సమావేశానికి అన్ని అంశాలతో డాక్యుమెంటేషన్ చేసుకొని రావాలన్నారు. ఎన్విరాన్ మెంట్ ఇంజనీర్లు తమ కేటాయించిన విధులు సక్రమంగా నిర్వహించాలన్నారు. అవెన్యూ ప్లాంటేషన్ కు అందిన ప్రతిపాదనలు పంపాలన్నారు. మొక్కల విషయంలో ఫారెస్ట్ అధికారులతో ఇప్పటికే చర్చించినందున వారి వద్ద నుండి మొక్కలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు రమణాచారి, పూర్ణచందర్, బాలాజీ, వీరారెడ్డి, మోయిజ్, తదితరులు పాల్గొన్నారు.