పాలేరులో ఇంజనీరింగ్ కళాశాల మంజూరు పట్ల కృతజ్ఞత ర్యాలీ
ఎమ్మెల్యే కందాళ
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
పాలేరు నియోజకవర్గంలో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల మంజూరు పట్ల సీఎం కేసీఆర్ కి కృతజ్ఞత ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి.ఖమ్మం రూరల్ మండలం పెద్దతండా నుండి వరంగల్ క్రాస్ రోడ్డు వరకు భారీ ఎత్తున కృతజ్ఞత ర్యాలీ నిర్వహించిన పాలేరు నియోజకవర్గ విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కంధాళ మాట్లాడుతూ మన నియోజకవర్గానికి ఇంజనీరింగ్ నర్సింగ్ ఫిషరీస్ పాలిటెక్నిక్ కాలేజీలు మంజూరు చేసినందుకు సిఎం కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు.