ఘనంగా టి పి సి సి అధికార ప్రతినిధి డాక్టర్ సత్యం శ్రీరంగం దంపతుల వివాహ మహోత్సవ వేడుకలు
కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి :
టీపీసీసీ అధికార ప్రతినిధి, పీసీసీ సభ్యులు డా. సత్యం శ్రీరంగం ఇందుమతి శ్రీరంగంల వివాహ వార్షికోత్సవం కూకట్ పల్లి వై జంక్షన్ లోని ఎన్ కెఎన్ఆర్ గార్డెన్స్ లో బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరైన సర్వే సత్యనారాయణ గజమాలతో సత్కరించి కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. మేడ్చెల్ మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందికంటి శ్రీధర్, పీసీసీ సభ్యులు కోలన్ హన్మంత్ రెడ్డి, పీసీసీ సభ్యులు హరివర్ధన్ రెడ్డి, టీపీసీసీ జనరల్ సెక్రటరీ నర్సా రెడ్డి భూపతి రెడ్డి, పీసీసీ సభ్యులు, మాజీ కార్పొరేటర్ గొట్టిముక్కల వెంగళ్ రావు, అన్ని డివిజన్ల అధ్యక్షులు, మహిళా డివిజన్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మహిళలు, యువకులు పాల్గొన్నారు.