ప్రజా సమస్యలే పరిష్కార ధ్యేయంగా పాదయాత్ర 

ప్రజా సమస్యలే పరిష్కార ధ్యేయంగా పాదయాత్ర 

కార్పొరేటర్ సత్యనారాయణ

కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి :

ప్రజల సమస్యలే పరిష్కార ధ్యేయంగా అన్ని శాఖల అధికారులతో స్థానిక కాలనీ అధ్యక్షులతో కలిసి ఇంటింటికి పాదయాత్రలో కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ.బుధవారం హనుమాన్ నగర్,ప్రగతి నగర్ లో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్ పరిధిలో అన్ని కాలనీలలో అభివృద్ధి పనులు 95% పూర్తయినట్లు ఇంకా కొన్ని అక్కడక్కడ పెండింగ్లో ఉన్న సిసి. రోడ్లు,డ్రైనేజీ, వాటర్ పైప్ లైన్, పనులు త్వరలోనే అన్ని పూర్తవుతాయని ప్రజల వద్దకు వెళ్తే మంచి ఆదరణ లభిస్తుందని సీఎం కేసీఆర్ చేపట్టే సంక్షేమ పథకాలు అన్ని ప్రజలకు అందుతున్నాయని ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, ఏ.ఈ శరత్ బాబు,వర్క్ ఇన్స్పెక్టర్ రత్నం,హనుమాన్ నగర్ కాలనీ అధ్యక్షులు ఏం.విఠల్, ప్రగతి నగర్ అధ్యక్షులు గణపతి, సీనియర్ బిఆర్ఎస్ నాయకులు టి.నర్సింలు, ప్రగతి నగర్ ఉపాధ్యక్షులు సత్తయ్య, ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్, కార్యదర్శి సాయి కిరణ్, తులసి దాస్, తిరుపతిరావు, ఎర్రన్న, కాశీం యాదవ్, టైల్స్ శ్రీనివాసులు, మానయ్య, రవి చారి, అప్పారావు, లోహిత్, పరమేష్ గౌడ్,రము, మహిళలు సరిత,కవిత, లలిత,లీల,రాజేశ్వరి, జిహెచ్ఎంసి అధికారులు,వాటర్ వర్క్స్ అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking