సున్నిత ప్రాంతాలను గుర్తించాలి
కలెక్టర్ ఆర్.వి.కర్ణన్
నల్గొండ, అక్షిత ప్రతినిధి : ఎన్నికలను పురస్కరించుకొని ఎన్నికల వ్యయం అధికంగా జరిగే అవకాశం ఉన్న సున్నిత ప్రాంతాలను గుర్తించేందుకు జిల్లా ఇంటెలిజెన్స్ కమిటీ జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి చర్చించారు.బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో ఎస్.పి,ఇన్ కంటాక్స్,ఎక్సైజ్,వాణిజ్య పన్నుల శాఖ,ఎల్.డి.యం.ఇతర అధికారులతో గత రెండు ఎన్నికల్లో,ఎన్నికల ముందు డబ్బు,మద్యం,ఇతర వస్తువులు పంపిణీ, స్వాధీనం ఉచితాలు, ఎక్కువ మొత్తంలో బ్యాంక్ ల ద్వారా ఆన్ లైన్,డిజిటల్ చెల్లింపులు ఎన్నికల వ్యయం అంశాలపై ఎన్నికల కమిషన్ సూచించిన స్టాండర్డ్స్ ఆపరేషన్ ప్రక్రియ ననుసరించి రానున్న ఎన్నికలలో తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. ఈ సమావేశం లో ఎస్.పి.అపూర్వరావు,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎక్సైజ్ సూపరిటెండెంట్ సంతోష్,ఎల్.డి.యం. శ్రామిక్ తదితరులు పాల్గొన్నారు.