విద్యార్ధుల భవితకు కిషోర్ చేయూత

విద్యార్ధుల భవితకు కిషోర్ చేయూత

అన్నారం పాఠశాలలో నోటు బుక్స్, పెన్నులు పంపిణీ

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

విద్యార్థుల ఉజ్వల భవితకు ప్రవాస భారతీయుడు కిషోర్ చేయూత అభినందనీయమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు వడ్డేపల్లి వెంకటేశ్వర్లు అన్నారు. కన్న ఊరిపై ఉన్న మమకారంతో పేద విద్యార్థులకు అండగా నిలుస్తున్నారన్నారు. శుక్రవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం అన్నారం ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో ఎన్నారై కిషోర్ జెల్లా దాదాపు రూ.30 వేల విలువైన నోటు పుస్తకాలు, జామెట్రీ బాక్స్ లు, పెన్సిల్స్, ఇతర స్టేషనరీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వడ్డేపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం కిషోర్ సహకారంతో నోటు పుస్తకాల పంపిణీ జరుగుతుందన్నారు. కిషోర్ ప్రతి సంవత్సరం పిల్లలకు నోటు పుస్తకాలు, ఇతర స్టేషనరీ ఇవ్వడం సంతోషంగా ఉందని అన్నారు. గతంలో కూడా పాఠశాలకు మౌలిక వసతుల కల్పనలో కిషోర్ పాత్ర గొప్పది అన్నారు.అమెరికాలో ఉన్నా కూడా పుట్టిన ఊరిని మరిచిపోకుండా సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో కిషోర్, సర్పంచ్ వీరారెడ్డి, పాఠశాల విద్యా కమిటి ఛైర్మెన్ గురువయ్య, ఉన్నత పాఠశాల ఇంఛార్జి హెచ్ ఎం ఉస్మాన్, ఉపాధ్యాయులు సీతారాం, శైలజ, సుశీల, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking