కల్తీ మద్యం వ్యాపారాన్ని అరికట్టాలి
ముషీరాబాద్, అక్షిత ప్రతినిధి :
కల్తీ వ్యాపారం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న పిలింనగర్ లోని హైదరాబాద్ వైన్ మార్ట్ ను సిజ్ చేసి, యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు బొర్రా సంపూర్ణ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టిఎంపిఎస్ రాష్ట్ర మహిళా కమిటీ సమావేశం బుధవారం రాంనగర్ లో జరిగింది. సమావేశంలో సంపూర్ణ మాట్లాడుతూ కల్తీ మద్యం త్రాగి చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయాని, రాష్ట్ర. ప్రభుత్వం కల్తీ మద్యం అమ్ముతున్న వైన్ షాప్ లను సిజ్ చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని అన్నారు. హైదరాబాద్ రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఉన్న పిలిం నగర్ లోని హైదరాబాద్ వైన్ మార్ట్ లో జోరుగా కల్తీ మద్యం విక్రయం జరుగుతున్నట్టు తెలిపారు. చిన్న పిల్లలకు మద్యం, గంజాయి అమ్ముతున్నారని ఈ వైన్ మార్ట్ యజమానికి కొంత మంది ఆబ్కారి శాఖ అధికారులు సహకరిస్తున్నారని ఆరోపించారు.
హైదరాబాద్ వైన్ మార్ట్ ఓనర్ కి మూడు వైన్ మార్ట్ లు ఉన్నాయని అన్ని షాప్స్ లలో ఇలాంటి దందాలే కొనసాగిస్తూ అక్రమంగా సంపాదిస్తున్నాడని అన్నారు. ఈ వైన్ మార్ట్ లకు తప్పుడు లిజ్ అగ్రిమెంట్ తో పర్మిట్ రూమ్ నడుపుతున్నాడని అందులో ఏలాంటి సదుపాయాలు లేవన్నారు.