విద్యార్థులకు రెండో జోనల్ స్థాయి పోటీలు 

ఆర్థిక అక్షరాస్యతపై పాఠశాలల విద్యార్థులకు రెండో జోనల్ స్థాయి పోటీలు
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
పాఠశాలల విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యత, వినియోగాల వినియోగదారుల హక్కుల పరిరక్షణ పై అవగాహన కల్పించేందుకు ఆర్బిఐ జాతీయ స్థాయి క్విజ్ పోటీలు నిర్వహించింది. ప్రభుత్వ పాఠశాలల్లో 8, 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థుల కోసం ఆర్బిఐ క్విజ్ పోటీలు నిర్వహిస్తోంది.. ఈ పోటీలను ఆర్బిఐ ప్రాంతీయ కార్యాలయాలు బ్లాక్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, కేంద్రపాలిత ప్రాంతాలైన లక్ష దీవులు, పుదుచ్చేరి రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులు ఈరోజు హైదరాబాద్ లో ఆర్బీఐ నిర్వహించిన ప్రాంతీయ స్థాయి పోటీలో పాల్గొన్నారు. ప్రాంతీయ స్థాయి పోటీలు నిర్వహించడం ఇది రెండోసారి. రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన పోటీల్లో 19023 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 38,045 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

అవగాహన, జ్ఞానం, నైపుణ్యాలు, ప్రవర్తన, వైఖరి కలయికగా ఆర్థిక అక్షరాస్యత ఉంటుంది. ఆర్థిక పరమైన సమస్యలను పటిష్టంగా ఎదుర్కోవడానికి అవసరమైన వనరులు అభివృద్ధి చేయడానికి, బడ్జెట్ రుణ సదుపాయాలను సురక్షితంగా, పటిష్టంగా నిర్వహించడానికి ఆర్థిక అక్షరాస్యత తోడ్పడుతుంది. ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి ఎదుర్కోవడానికి సిద్ధం కావడానికి అవసరమైన వ్యూహాలను సిద్ధం చేయడానికి కూడా ఆర్థిక అక్షరాస్యత సహకరిస్తుంది. మహమ్మారి సమయంలో ఆర్థిక అక్షరాస్యత అంశానికి ప్రాధాన్యత పెరిగింది. ఆర్థిక అక్షరాస్యత అంశానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ సూచించింది. పొదుపు ప్రోత్సహించడం, తీసుకున్న రుణాలు సక్రమంగా వినియోగించడం, సక్రమంగా తిరిగి చెల్లించడం లాంటి వ్యూహాత్మక లక్ష్యాలను నిర్ణయించింది. డిజిటల్ ఆర్థిక సేవల వినియోగాన్ని ఎక్కువ చేయడం, మెరుగుపరచడం, నష్టాల నిర్వహణ, వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించడం లక్ష్యాలుగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన పోటీల్లో ప్రాతినిధ్యం వహించిన పాఠశాలలు ఆంధ్రప్రదేశ్‌లోని చిట్టివలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల , కర్ణాటక బేవినహళ్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల , కేరళ కలంజూర్ జిహెచ్ఎస్ఎస్, విహెచ్ఎస్ఎస్ పాఠశాల, లక్షద్వీప్ లోని అగట్టి జిహెచ్ఎస్ఎస్, సింధనై చిర్పి పుదుచ్చేరిలోని వీరపట్టణం సింగరవేలన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, , తమిళనాడు లోని గాంధీమా నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, తెలంగాణ లోని పాములపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విజేతలుగా నిలిచాయి. జోనల్ స్థాయి పోటీలో తమిళనాడు రాష్ట్ర కోయింబత్తూర్ గాంధీమా నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన జి.రామ ప్రియ,ఎస్. ఆకాష్ విజేతలుగా నిలిచారు. ప్రాంతీయ స్థాయిలో నిర్వహించిన 5 పోటీల్లో గెలుపొందే విద్యార్థులకు ఆర్బీఐ జాతీయ స్థాయిలో నిర్వహించే పోటీలో వీరు పాల్గొంటారు.
జోనల్ స్థాయి పోటీలో పాల్గొన్న విద్యార్థులను ఆర్బిఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ అజయ్ కుమార్ సన్మానించారు. బ్యాంకింగ్ కార్యకలాపాల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించడానికి చర్యలు అమలు చేస్తున్నామన్నారు. అవగాహన పొందిన విద్యార్థులు ఇతరులకు బ్యాంకింగ్ కార్యకలాపాల పట్ల అవగాహన కల్పించడానికి అవకాశం కలుగుతుంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking