సీఎం కేసీఆర్ పాలన
సంక్షేమానికి స్వర్ణయుగం
* కుల వృత్తులకు బీఆర్ఎస్ హయాంలో పునరుజ్జీవనం
* బీసీ బంధు ద్వారా మంజూరైన రూ.3 కోట్ల విలువైన చెక్కులు పంపిణీ
గుత్తా సుఖేందర్ రెడ్డి, భాస్కర్ రావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
సీఎం కేసీఆర్ పాలన సంక్షేమానికి స్వర్ణయుగంగా మారిందని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు పేర్కొన్నారు. అట్టడుగు వర్గాల పేదలను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. బీసీల అభ్యున్నతి కోసం లక్ష రూపాయల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తున్నదని అన్నారు. బీసీ, ఎంబీసీల్లోని 14 కులవృత్తులు చేసుకునేవారికి రూ. లక్ష సాయం అందిస్తున్నదని అన్నారు. శనివారం మిర్యాలగూడ పట్టణంలోని ఎస్వీ గార్డెన్స్ ఫంక్షన్ హాల్ లో నియోజకవర్గ వ్యాప్తంగా 300 మంది లబ్ధిదారులకు ఒక్కొకరికి లక్ష రూపాయల చొప్పున మంజూరైన రూ.300 కోట్ల విలువైన చెక్కులను వారు పంపిణీ చేశారు.

బీసీ బంధు చెక్కుల పంపిణీ అనంతరం వారు మాట్లాడారు. కుల వృత్తులకు బీఆర్ఎస్ హయాంలో పునరుజ్జీవనం మొదలైందని అన్నారు. దళితులు, బీసీలకు అందిస్తున్న మాదిరిగానే మైనార్టీలకు కూడా రూ.లక్ష ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తున్నదని అన్నారు. బిడ్డ కడుపులో పడ్డ దగ్గర నుంచి మొదలుకుంటే వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. పేదల మీద కేసీఆర్‌కు ఉన్న ప్రేమ ఇతరులకు ఎవ్వరికీ లేదన్నారు. ప్రతి పథకం లబ్దిదారులకు నేరుగా అందుతున్నదని అన్నారు. ఎవరూ అడక్కున్నా.. ప్రతిపక్షాలు డిమాండ్ చేయకున్నా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. బీఆర్ఎస్ సర్కార్ బడుగు, బలహీన వర్గాల ప్రజల్లో వెలుగులు నింపుతోందని అన్నారు. అనంతరం నియోజకవర్గ వ్యాప్తంగా 29 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన 13 లక్షల 98 వేల విలువైన చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, తెలంగాణ రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహా రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, డీసీఎంఎస్ జిల్లా వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణ రెడ్డి, మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ బైరం బుచ్చయ్య, వైస్ చైర్మన్ కుందూరు వీరకోటి రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ చిట్టిబాబు నాయక్, ఆర్డీవో చెన్నయ్య, జడ్పీటీసీ అంగోతు లలిత హాతిరాం, ఇరుగు మంగమ్మ-వెంకటయ్య, కుర్ర సేవ్యా నాయక్, ఎంపీపీ నూకల సరళ హన్మంత్ రెడ్డి, పోకల శ్రీవిద్య-రాజు, ధీరావత్ నందిని రవితేజ, బాలాజీ నాయక్, జిల్లా కో-ఆప్షన్ సభ్యులు మోసిన్ అలీ, నాయకులు యూసుఫ్, మధార్ బాబా, అన్నభీమోజు నాగార్జునచారి, మిర్యాలగూడ మండల రైతు బంధుసమితి అధ్యక్షులు గడగోజు ఏడుకొండలు, మార్కెట్ డైరెక్టర్లు రామకృష్ణ, పత్తిపాటి నవాబ్, కట్టా మల్లేష్ గౌడ్, చలికంటి యాదగిరి, వైస్ ఎంపీపీ అమరావతి సైదులు, మండల పార్టీ అద్యక్షులు పాలుట్ల బాబయ్య, నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, మట్టపల్లి సైదులు యాదవ్, డీసీసీబీ డైరెక్టర్ బంటు శ్రీనివాస్, బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారులు, ఎంపీడీఓలు, పట్టణ కౌన్సిలర్లు, వార్డ్ ఇంఛార్జీలు, వార్డు అధ్యక్షులు, గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, వార్డు మెంబర్లు, తదితరులు పాల్గొన్నారు.