గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలి

గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలి

బస్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు

ప్రైవేట్ వెహికల్స్ ను ఆశ్రయిస్తున్న విద్యార్థులు, ప్రజలు

ప్రమాదాలకు గురవుతున్న ప్రజలు

బి ఎస్ పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని

నకిరేకల్, అక్షిత ప్రతినిధి :

మండలంలో అన్ని రూట్లలో బస్సు సౌకర్యం కల్పించాలని బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని అన్నారు. చిట్యాల మండలం ఊరుమడ్ల గ్రామంలో ప్రజలతో కలిసి ఆమె మాట్లాడారు. అనేక మంది పిల్లలు వివిధ ప్రాంతాల్లో చదువుతున్నారని తెలిపారు. గ్రామీణ విద్యార్థులకు సరైన సమయానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో తరగతులకు హాజరుకాలేకపోతున్నారు. తప్పనిసరి పరిస్థితిలో ఆటోల్లో ప్రయాణించి ప్రమాదలకు గురైన సంఘటనలు ఉన్నాయన్నారు. విద్య సంస్థల ప్రారంభం అనంతరం బస్సులను పునరుద్దరించకపోవడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు.గ్రామాల్లో వుండే ప్రజలు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి ఇతర గ్రామాలకు, మండల కేంద్రాలకు వెళ్లే ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.వెంటనే అన్ని రూట్లకు ఆర్టీసీ బస్సులను పునరుద్దరించాలని కోరారు. చిట్యాల మునుగోడు షటిల్ బస్సు నడిపితే చిట్యాల మండలం, మునుగోడు మండలంలో ఉన్న గ్రామాల్లో చాలా లాభం చేకూరుతుంది అని అన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే అభివృద్ధి కోసమే పార్టీ మారాను అని చెబుతున్న ఎమ్మెల్యే ఇక్కడి ప్రజలు, విద్యార్థుల గోస నీకు కనపడడం లేదా అని అన్నారు. ఇప్పటికైనా స్పందించి బస్సు సౌకర్యం కల్పించాలని అన్నారు లేనియెడల ఎమ్మెల్యే కు ప్రజలే బుద్ధి చెప్పుతారు అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, మండల అధ్యక్షులు గ్యార శేఖర్,మండల అడ్వైజర్ జిట్టా నర్సింగ్ రాజ్, నాయకులు అన్నమళ్ళ సైదులు, భీంపాక సైదులు, బి ఎస్ పి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking