ప్రజా చైతన్యంకై ఆటలు.. పాటలు

ప్రజా చైతన్యంకై ఆటలు, పాటలు

గద్దర్, జహీర్ సంస్మరణ సభలో ప్రొఫెసర్ ఖాసీం, పాశం

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

ప్రజా సమస్యలు, చైతన్యంకై గద్దర్ ఆటలు పాటలని వినోదం కోసం కాదని సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, ప్రొఫెసర్ పి. ఖాసీం, అరుణోదయ సాంస్కృతిక బాధ్యులు విమలక్క, వెంకట్ రెడ్డిలు అన్నారు. గద్దర్ కలలు గన్న రాజ్యం కోసం కృషి చేయాలని కోరారు. మిర్యాలగూడలో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద
ప్రజా యుద్ధ నౌక గద్దర్, సియాసత్ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీర్ అలీ ఖాన్ ల సంస్మరణ సభ మంగళవారం రాత్రి వర్షంలో నిర్వహించారు. జహీర్ అలీ ఖాన్ కలంతో ప్రజా సమస్యలపై స్పందించే వారని ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ అన్నారు. ప్రజా సమస్యలపై స్పందించే ఉద్యమకారులు సభకు ప్రజలు హాజరైనారు. కార్యక్రమంలో కస్తూరి ప్రభాకర్, దారం మల్లేష్ యాదవ్, మాలోత్ దశరథనాయక్, మారం శ్రీనివాస్, తాళ్ళపల్లి రవి, పోస్టల్ యూనియన్ రామయ్య, బిక్షమయ్య, ముత్తయ్య, జ్వాల వెంకటేశ్వర్లు, గోపినాయక్, ఖాజా హమీదుద్దీన్, అరుణ, కొత్తపల్లి సైదులు, గుడిపాటి కోటయ్య, చేగొండి మురళి యాదవ్, నగేష్, జ్వాల వెంకటేశ్వర్లు, నల్లగంతుల నాగభూషణం, మట్టయ్య పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking