ప్రేమానురాగాలకు ప్రతీక రాఖీ

ప్రేమానురాగాలకు ప్రతీక రాఖీ

మిర్యాలగూడ నియోజకవర్గ సోదరసోదరీమణులకు శుభాకాంక్షలు

నల్లమోతు భాస్కర్ రావు

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

ప్రేమానురాగాలకు రాఖీ పౌర్ణమి ప్రతీక అని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు పేర్కొన్నారు. నియోజకవర్గ సోదర సోదరీమణులకు రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా జరుపుకునే రక్షా బంధన్ పండుగ సహోదరత్వానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. జీవితాంతం తమకు అండగా ఉండాలని ఆడబిడ్డలు తమ అన్నాదమ్ముల్లకు అనురాగంతో చేతికి రక్షా బంధనాన్ని కట్టడం గొప్ప సందర్భం అని భాస్కర్ రావు తెలిపారు. రక్షాబంధన్ సాంప్రదాయం భారతీయ జీవన ఔన్నత్యానికి నిదర్శనమని, ప్రజల్లో సహోదరత్వాన్ని మరింతగా పెంపొందిస్తుందని ఆయన ఆకాంక్షించారు. ప్రేమనుబంధాలకు ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి పండుగను నియోజకవర్గ ప్రజలంతా ఆనందోత్సాహల్లో జరుపుకోవాలని భాస్కర్ రావు కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking