మిర్యాలగూడ నియోజకవర్గ సోదరసోదరీమణులకు రాఖీ శుభాకాంక్షలు
నల్లమోతు సిద్దార్ధ
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
మిర్యాలగూడ నియోజకవర్గ సోదరసోదరీమణులకు బీఆర్ఎస్ యువనేత, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమానురాగాలకు రాఖీ పౌర్ణమి ప్రతీకగా నిలుస్తుందన్నారు. దేశవ్యాప్తంగా జరుపుకునే రక్షా బంధన్ పండుగ సహోదరత్వానికి తార్కాణమని అన్నారు. జీవితాంతం తమకు అండగా ఉండాలని ఆడబిడ్డలు తమ అన్నాదమ్ముల్లకు అనురాగంతో చేతికి రక్షా బంధనాన్ని కట్టడం గొప్ప సందర్భం అని సిద్దార్ధ తెలిపారు. రక్షాబంధన్ సాంప్రదాయం భారతీయ జీవన ఔన్నత్యానికి నిదర్శనమని, ప్రజల్లో సహోదరత్వాన్ని మరింతగా పెంపొందిస్తుందని ఆయన ఆకాంక్షించారు. ప్రేమనుబంధాలకు ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి పండుగను నియోజకవర్గ ప్రజలంతా ఆనందోత్సాహల్లో జరుపుకోవాలని నల్లమోతు సిద్దార్ధ ఆకాంక్షించారు.