ఎల్బీ నగర్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత
దేవి రెడ్డి సుధీర్ రెడ్డి
వనస్థలిపురం, అక్షిత ప్రతినిధి :
వనస్థలిపురం డివిజన్ నందు గతంలో పలు కాలనీల యందు ఒక కోటి ఇరవై లక్షల రూపాయల అభివృద్ధి పనులు మంజూరు చేయడం జరిగింది. మంజూరు అయిన పనుల శంకుస్థాపన కార్యక్రమానికి ఎల్బీనగర్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత దేవిరెడ్డి సుధీర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. దానిలో భాగంగా ఎఫ్.సీ.ఐ .కాలనీ నందు 60 లక్షల 20 వేల రూపాయిలతో సీ.సీ.రోడ్డు పనులకు మరియు జహంగీర్ నగర్ కాలనీ 60 లక్షల రూపాయల వ్యయంతో సి.సి.రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు .ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని ప్రధాన సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం చేయడం జరుగుతుందని అన్నారు. ముందుగా త్రాగునీరు, డ్రైన్స్, రోడ్లకు ప్రాధాన్యత ఇస్తూ, మిగతా పనులు కూడా ప్రాధాన్యత క్రమంలో చేయడం జరుగుతుందని అన్నారు. నియోజకవర్గ అభివృద్దే తన లక్ష్యం అని తెలిపారు. అలాగే ఎల్.బి.నగర్ నియోజకవర్గ నికి దాదాపు 4752 డబల్ బెడ్ రూమ్స్ ఇండ్లు మంజూరు కావడం జరిగింది. గత రెండు రోజుల క్రితం కలెక్టర్ కార్యాలయం నందు దాదాపు 500 మందికి లక్కీడ్రా తీయడం జరిగింది. వారికి ప్రతాప్ సింగారం దగ్గర డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు కావడం జరిగింది. విడతలవారిగా డ్రాలు తీయడం జరుగుతుంది అని తెలిపారు. ఇట్టి లక్కీ డ్రా విషయంలో దళారులను నమ్మి మోసపోవద్దు అని తెలిపారు. కావున ఇండ్లు వచ్చిన వారు తమ, తమ పత్రాలతో శనివారం ఎల్.బి.నగర్ మున్సిపల్ కార్యాలయం వద్దకు ఉదయం 07.00 గంటలకు వస్తే వారిని అధికారులు అక్కడ నుంచి బస్ సౌకర్యం కల్పించి ఇండ్లు వచ్చిన దగ్గరకు తీసుకెళ్లడం జరుగుతుంది అని తెలిపారు. అలాగే నందనవనం ఇండ్లలో అక్రమంగా ఉంటున్న వారికి కూడా పలుచోట్ల ఇండ్లు ఇవ్వడం జరిగింది. కొందరు అవే ఇండ్లలో ఉంటున్న నేపథ్యంలో వారికి కూడా మరొక చోట డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో కార్పొరేటర్ వెంకటేశ్వరరెడ్డి, మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్ రెడ్డి, డివిజన్ బారాస అధ్యక్షులు చింతల రవికుమార్ గుప్తా, ఉద్యమకారులు కుంట్లూరు వెంకటేష్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ లగ్గోని శ్రీధర్ గౌడ్, వేములయ్య గౌడ్, ఖైసర్, మధు గౌడ్, గడాల రాజు, జైపాల్ రెడ్డి, సంతోష్ మరియు డివిజన్ పరిధిలోని సీనియర్ నాయకులు, ఉద్యమకారులు , మహిళలు, పార్టీ అభిమానులు, వివిధ కాలనీ సంక్షేమ సంఘాల అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.