మతతత్వ పార్టీలకు
తగిన బుద్ధి చెప్పాలి
*తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు, ఐజేయు జాతీయ ఉపాధ్యక్షులు ఇస్మాయిల్*
*కోదాడ, అక్షిత ప్రతినిధి*
జర్నలిస్టుల సమస్యల పట్ల,ఇండ్ల పట్టాలకు తప్పకుండా కృషి చేస్తానని ఐజేయు జాతీయ ఉపాధ్యక్షులు ఇస్మాయిల్ అన్నారు. బెంగళూరు నుండి హైదరాబాదు వెళ్తూ జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్ నివాసంలో పాత్రికేయులను కలుసుకొని మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత భారత దేశ పరిస్థితుల్లో ఉన్నటువంటి జాతీయ పార్టీలు దేశ ప్రజల మధ్య కులం మత పేరుతో విడగొడుతూ ప్రజాస్వామ్యం మీద నమ్మకాన్ని పోగోడుతున్నాయని దీన్ని జర్నలిస్టులుగా తీవ్రంగా ఖండించాలి. హిందుత్వం పేరు మీద మరణోహం సృష్టిస్తున్నటువంటి ప్రభుత్వానికి కూడా తగిన బుద్ధి చెప్పాలి అన్నారు పాత్రికేయుల సమస్యల పట్ల ఇండ్ల పట్టాలు వచ్చేంతవరకు తప్పకుండా కృషి చేస్తానని తెలిపారు.

అదేవిధంగా ఇటీవల జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్న గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు, నియోజకవర్గ అధ్యక్షులు వంగవీటి శ్రీనివాసరావు , వెన్నబోయిన పూర్ణచంద్రరావు, చింతలపాటి సురేష్, మాతంగి సురేష్, రాంబాబు, మరికంటి లక్ష్మణ్, కుడుముల సైదులు, గణేష్ , పిడమర్తి గాంధీ, నజీర్, జూలూరు బసవయ్య, చీమ శేఖర్, బండి శ్రీనివాస్, ఎస్ ఎస్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.