*వట్టె జానయ్య యాదవ్ పై కేసులు ఎత్తివేయాలి*

*వట్టె జానయ్య యాదవ్ పై కేసులు ఎత్తివేయాలి*

*బి ఎస్ పి నియోజకవర్గ ఉపాధక్షులు పావిరాల నర్సింహా యాదవ్*

నకిరేకల్,అక్షిత ప్రతినిధి :

వట్టే జానయ్య యాదవ్ పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని బిఎస్ పి నకిరేకల్ నియోజకవర్గ ఉపాధక్షులు పావిరాల నర్సింహా యాదవ్ డిమాండ్ చేశారు. రామన్నపేట బి ఎస్ పి పార్టీ ఆఫీస్ లో వారు మాట్లాడుతూ బహుజన బిడ్డగా బిసి, ఎస్ సి, ఎస్ టి, మైనారిటీ వర్గాల ప్రజలకు అండగా ఉంటున్నాడనే, ఉద్దేశ్యంతో అగ్రవర్ణాలకు చెందిన మంత్రి జగదీశ్ రెడ్డి జానయ్య యాదవ్ పై అక్రమ కేసులు పెట్టి, కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు.బహుజన బిడ్డలు గా తెలంగాణ రాష్ట్ర సాధాన కోసం,ఉద్యమంలో అనేక కేసులు పెట్టి,నిర్బంధాలు చేసిన మా బహుజనులు ఏనాడు భయపడలేదని బహుజన బిడ్డల పోరాట త్యాగాల ఫలితం వలనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, తెలంగాణ రాష్ట్రంలో బహుజనులు అణచివేతకు గురి అవుతున్నరని,ప్రస్తుత తరుణంలో బహుజన బిడ్డలను బానిసలుగా చూస్తున్న మంత్రి జగదీశ్ రెడ్డి ఓటమే ద్యేయంగా పనిచేయుటకు ప్రతి బిసి, ఎస్ సి, ఎస్ టి, మైనారిటీ వర్గాల బిడ్డలు కంకణ బద్దులై ఉన్నారని అన్నారు.వట్టె జానన్న పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తి వేయాలని లేనియడల మంత్రి జగదీశ్ రెడ్డి బహుజనుల ఆగ్రహానికి గురి కాక తప్పదని హెచ్చరించారు. జానన్న గతంలోనే అక్రమాలు చేసి ఉంటే, మంత్రి తన పార్టీలోకి ఏ విదంగా రానిచ్చిండు. ఒక వేల బిఆర్ఎస్ లోకి వచ్చిన తరువాత అక్రమాలు చేస్తే మంత్రి అండతో చేసినట్లేగా ఒక సారి విజ్ఞత కలిగిన సూర్యాపేట నియోజకవర్గ ప్రజలు ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు.మంత్రి జగదీశ్ రెడ్డి , అగ్రకుల అహంకారంతో అణచివేతకు గురి అయిన బిసి, ఎస్ సి, ఎస్ టి, మైనారిటీ బిడ్డలు ప్రశ్నిస్తే,అక్రమ కేసులు పెట్టడం హాస్యాస్పదంగాఉందన్నారు. బహుజనుల బిడ్డల ఓట్లు వేస్తేనే జగదీశ్ రెడ్డి ఎమ్మెల్యే గా గెలిచి, మంత్రి అయ్యారు అనే విషయం మరిచిపోవద్దు గుర్తుచేశారు.వెంటనే జానయ్య యాదవ్ పై పెట్టిన కేసులు ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బెల్లి మల్లయ్య యాదవ్ మండల అధ్యక్షులు మేడి సంతోష్ ఉపాధ్యక్షులు గూని రాజు ప్రధాన కార్యదర్శి నకిరేకంటి నరసింహ కోశాధికారి గట్టు రమేష్ తదితరులు పాల్గొన్నారు….

Leave A Reply

Your email address will not be published.

Breaking