సీతారామా పాలేరు “జలదార” కు నీవే దిక్కు

సీతారామా పాలేరు “జలదార” కు నీవే దిక్కు

-తుమ్మల కాంగ్రెస్ కు ఇదే ప్రదాన హక్కు

-సామాజిక వేత్త లోడిగ వెంకన్నయాదవ్ (పాలేరు)

 

ఖమ్మం/ అక్షిత బ్యూరో :

రాజకీయ నాయకుడు ప్రజాసేవలో పార్టీని ఎంచుకొని ప్రజల్లోకి వెళ్ళతాడు.కాని తుమ్మల నాగేశ్వరరావుని ప్రజలే పార్టీని ఎంపిక చేసి ప్రజాసేవలోకి ఆహ్వనించడం దేశరాజకీయాలలో ఒక వినూత ఒరవడికి తెరలేపినట్టు అయింది. ప్రజాస్వామ్య రాజకీయ పరిణామాలు ఖమ్మం జిల్లాలో ఇది తుమ్మలకు దక్కింది అని చెప్పవచ్చు. నాయకుడు పార్టీ మారాలని కోరుకోవడంలో తప్పు లేదు.కాని నాయకుడిగా తన ప్రమేయం లేకుండా ప్రజలే నాయకుడు పార్టీ మారాలని కోరుకోవడం అదికూడ తమకిష్టమైన పార్టీలోకి వెళ్ళాలని కోరుకోవడం తమ ఆదినాయకుడు తమ ఆలోచనలకు అణుగుణంగా నిర్ణయం తీసుకోవడంలో పాలేరు తుమ్మల అభిమానులు అభివృద్ధిని కోరుకొనే పాలేరు ప్రజలు సఫలీకృతం అయ్యారు అని చెప్పవచ్చు. రాజకీయాలు భ్రష్టు పట్టిపోతున్న దేశరాజకీయాలలో రాజకీయ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది ఒక నూతన రాజకీయ ఒరవడి దారితీస్తుంది అని చెప్పవచ్చు.

40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో మచ్ఛలేని రాజకీయ వేత్తగా అవినీతికి ఆమడదూరంలో బ్రతికి ఉమ్మడి ఖమ్మంజిల్లాలో అభివృద్ధి ప్రదాత గా పేరుతెచ్చుకున్న అరుదైన నేత తుమ్మల నాగేశ్వరరావు అని చెప్పవచ్ఛు.తన కుటుంబం జలంగం కుటుంబం తో ఎంతో సానిత్యంగా కాంగ్రెసు పార్టీలో ఉన్న రోజులలో యన్ టి రామారావు పెట్టి న తెలుగు దేశం పార్టీ కి ఆకర్షితుడై ఆపార్టీ లో చేరి ఖమ్మంజిల్లా రాజకీయాలలో చురుకైన పాత్ర పోషించారు. అంతే కాదు మిత్రపక్షాలతో సుదీర్ఘ మైత్రి కి నాంది పలికిన పేరు రాష్ట్రంలో తుమ్మలకు ఉంది. తెలంగాణ రాష్ట్రంలో వచ్ఛిన ప్రత్యేక రాష్ట్రం కొరకు ఏర్పడిన రాజకీయ పరిణామాల వలన కేసీఆర్ తో ఉన్న సన్నిహితం ఓటమి చెందిన తుమ్మలను పిలిచి రాష్ట్ర మంత్రి ని చేసిన కారణంగా ఖమ్మం జిల్లా అభివృద్ధి కి తుమ్మలకు మరో అవకాశం దొరికింది. వచ్ఛిన అవకాశంను అందిపుచ్చుకొని అభివృద్దిలో జిల్లాను పరుగులు పెట్టించారు. ప్రత్యేకించి పాలేరును భక్తరామదాసు ప్రాజెక్టు కు రూపకల్పన చేసి జలసిరులతో పాలేరుబీడుభూములను సిరిలుపండించేలా అహర్నిశలు కష్టపడి శభాష్ అనిపించుకొన్నారు తుమ్మల.

పాలేరు ప్రజల రైతాంగం ఆనందం కళ్ళారా చూసిన తుమ్మల ఇది శాశ్వతంగా ఉండిపోవాలని సీతారామప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టి గోదావరి నదీజలాలు దిగువనుండి ఎగువనున్న పాలేరు వరకు తీసుకువస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది లక్షల ఎకరాల కు సాగునీరు అంది పచ్ఛని పొలాల్లో సిరిలు పండించేలా చేయవచ్ఛు అనే దృడసంకల్పం జీవిత లక్ష్యంగా ఎంచుకొని పనిచేయడం మొదలు పెట్టిన తుమ్మలకు ఊహించని రాజకీయ కుట్ర తో పాలేరు లో ఓటమి చెంది తన లక్ష్యం నిరాషకు గురిఅయ్యేలా చేసింది.ప్రజలిచ్ఛిన ధైర్యం అభిమానుల ప్రోత్సహంతో పాలేరు ప్రజల్లో నే ఉండి ఈ ఒక్క సారి పోటీచేసి సీతారామా ప్రాజెక్టును సాదించి పాలేరుప్రజల పాదాలు కడిగి రాజకీయ జీవితం నుండి నిష్క్రమించాలని ప్రజలతో తరుచూ చెప్పుకొంటూ తిరుగుతున్న తుమ్మలకు పాలేరుటిక్కెటు కేసీఆర్ నిరాకరించడంతో ఖమ్మంజిల్లాలో ని తుమ్మల అభిమానులు పాలేరు లో అభివృద్ధి ని ఆకాంక్షించిన ప్రజలనుండి ఒక్కసారిగా నిరసనజ్వాలలు ఎగిసిపడి తుమ్మల పోటీ చేసితీరాలని బలమైన కోరిక వెల్లడించారు. దానికి నిదర్శనం తుమ్మలకు స్వాగతం పలికిన తీరు ఇటీవల ప్రత్యేక్షంగా చూసాము.

పోటీ చేసి కేసీఆర్ కు బుద్ధి చెప్పాలనే నినాదం కాస్తా ఊపందుకుంది. అంతేకాదు కాంగ్రెస్ లో చేరి విజయం సాదించడం తప్ప మరో సహసం చేయవద్దు అనే అభిప్రాయం ప్రజల్లో అభిమానులలో బలంగా వినిపించింది. దీనికి తోడు కేసీఆర్ పిలిచి టిక్కెట్ ఇచ్ఛినా తిరిగి తీసుకోవద్దు మనస్సు మార్చుకోవద్దని ప్రజలు మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. పలు నిర్ణయాలు ప్రజలే తీసుకొని తుమ్మల ను మౌనముద్రగా ఉండేలా చేసి తమ నిర్ణయం అమలు అయ్యేలా గ్రామాల్లో ప్రజలు అభిమానులు గండుగులపల్లి కి బారులు తీరేలా చేశాయి. కాంగ్రెసు పార్టీ లో చేరాలని బలమైన నిర్ణయం ప్రజలే ముందు గా నిర్ణయం తీసుకొని తుమ్మల కు తన ప్రమేయం లేకుండా వేరే మార్గం లేక కాంగ్రెస్ లో చేరేవిదంగా పరిస్థితులు వెన్నంటే వెంటాడేలా తుమ్మలను చేస్తున్నాయి. చివరకు మీ ఇష్టమే నా ఇష్టం అనేలా చేశాయి.మీ ఇష్టప్రకారం సరిఅయిన సమయంలో సరిఅయిన నిర్ణయం తీసుకొందాం అని తుమ్మల అనేసరికి జిల్లా ప్రజలు తుమ్మల అభిమానులు పాలేరు అభివృద్ధి ని ఆకాంక్షించిన ప్రతీఒక్కరు సంతో శించేలా చేశాయి. ఇప్పుడు తుమ్మల అభిమానులే కాకుండా ముఖ్యంగా పాలేరు కాంగ్రెసు వాదులు గండుగులపల్లి బారులు తీరడం తుమ్మలకు కొంత ఊరటనిచ్చింది అని చెప్పవచ్చు. తాను అనుకున్న లక్ష్యం ప్రజాఅభిష్టం మేరకు కృషి చేస్తాను వానలు కురిసిన కురవక పోయిన ,సాగర్ జలాలు పాలేరు వచ్ఛిన రాకపోయినా ఆకేరు ఎండిపోయినా గోదావరి నదీ జలాలతో సీతారామా ప్రాజెక్టును పూర్తి చేయడానికి పాలేరు లో పోటీ చేయక తప్పదు అనే బలమైన నిర్ణయం తుమ్మల నోట వెలుబడేలా చేసింది. అంతే కాకుండా ప్రజలు అభిమానులు కోరిక మేరకు కాంగ్రెసు లో చేరి నా లక్ష్యం పూర్తి చేసి పాలేరు ప్రజల రుణం తీర్చుకొంటాను మీ అభీష్టం మేరకే నిర్ణయం తీసుకొంటాను అని కూసుమంచి నుండి వచ్ఛిన ప్రజాప్రతినిధులతో ముఖ్యనాయకులతో ఇటీవల అనటం తో అభిమానులలో ఆనందంతో ఊగిపోయారు. తిరుగు ప్రయాణంలో ఇకపై మన నాయకుడు పాలేరులో గెలవటానికి ఏవిధంగా పనిచేయాలో చర్చించుకోవటం మొదలు పెట్టారు. ప్రజల అభీష్టం మేరకు తుమ్మల నిర్ణయం పాలేరు విజయ తీరాలకు కాంగ్రెస్ తీసుకువెళ్ళుతుంది అని ఆశిద్దాం.

Leave A Reply

Your email address will not be published.

Breaking