బ్లాక్ మనీ దొరలను తరిమేద్దాం
–దూకుడు మీదున్న బీసీ జేఏసీ
-ఖమ్మం పాలేరుపై ప్రత్యేక కసరత్తు
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
బీసీ జేఏసీ జిల్లా కార్యవర్గం మొత్తం ఉన్నత విద్యావంతులైనందున బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై బీసీల మేల్కొలుపు కరపత్రాలతో ఇంటింటికి ప్రచారాన్ని నిర్వహించాలని బీసీ జేఎసి జిల్లా నాయకులు పాల్వంచ రామారావు పిలుపునిచ్చారు.నిన్న ఖమ్మంలో మీడీయాతో మాట్లాడూతూ ప్రస్తుతం వేలకోట్లు అక్రమ ధనార్జన చేసిన వారంతా రాజకీయాలలోకి ప్రవేశించి ఎప్పటినుండో రాజకీయాలలో ఉన్నవారిని తరిమేసి రకరకాల పార్టీలు మారుతూ ఓటర్ల ముఖాన ఎంగిలి మెతుకులు విసిరినట్లు వందకోట్లు వెదజల్లి గెలిచి వెయ్యి రెట్లు ప్రజాధనాన్ని లూటీ చేస్తారన్నారు.ఈనాయకులు ఏనాడు ప్రజా సమస్యలపై మాట్లాడకపోగా అబద్ధాల అభివృద్ధిని శ్రీరంగనీతులను వారికి భజనచేసే టీవీలలో వార్తాపత్రికలలో ప్రచారం చేసుకోవడం అమాయకపు పార్టీ కార్యకర్తలు సెల్ ఫోన్ వాట్సాప్ గ్రూపులలో తమ నాయకుడు అభివృద్ధి ప్రధాత అని దానకర్ణుడని పెద్ద నీతిమంతుడని 95 శాతం అబద్ధాలు ప్రచారం చేసుకోవడాన్ని ప్రజలకు తెలియజేస్తూ బ్లాక్ మనీ దొరలను ఎన్నికల్లో ఓడించి కలుషితమైన రాజకీయాలనుంచి తరిమేయకపోతే బీసీలను రాజకీయాల్లోనే కాకుండా అన్ని రంగాలలో అణిచివేస్తూ ప్రజలకు చెందాల్సిన సంపదనంతా లూటీ చేస్తారన్నారు అందుకనే బీసీ అభ్యర్థికే ఓట్లు వేయించడానికి అన్ని వర్గాల ప్రజలను చైతన్యవంతం చేయటానికి పక్కా ప్రణాళికతో ప్రజల్లోకి వెళుతుందన్నారు బీసీలకు అన్యాయం చేసే ఏరాజకీయ పార్టీలైన ఏనాయకుడికైనా గుణపాఠం తప్పదని హెచ్చరించారు.బీసీ జేఏసీ అధ్యక్ష కార్యదర్శులు చిట్టోజు రమేష్ టివి రాజు నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిథిగా గౌరవాధ్యక్షుడు పాల్వంచ రామారావు డాక్టర్ బివి రాఘవులు గుండ్లపల్లి శ్రీనివాస్ కంది నాగచారి నీలగిరి శ్రీనివాస్ సిరికొండ సాయిరాం దుర్గాప్రసాద్ గౌడ్ అంజన్ రాజు డి వెంకటరామయ్య పాల్గొన్నారు.