అతను పేరుకే అటెండర్… పెత్తనం అంత ఆయనదే..

అతను పేరుకే అటెండర్…

పెత్తనం అంత ఆయనదే..

ఏ ఫైల్ కదలాలన్నా ….చేతులు తడపాల్సిందే..!
మునుగోడు ,అక్షిత ప్రతినిధి:

ఆ కార్యాలయంలో ఆయన అటెండర్.. కానీ పెత్తనం అంతా ఆయనదే.. ఏ ఫైల్ ముందుకు కదలాలన్న ….ఎవరికి పెన్షన్ మంజూరు, బిల్లులు విడుదల కావాలన్నా ఆయన అనుగ్రహం ఉండాల్సిందే. ఉన్నతాధికారి కూడా ఎక్కడైనా పర్యవేక్షణ చేయాలంటే ఆయన చెప్పింది వినాల్సిందే లేకపోతే అతని కూడా ఆ కార్యాలయంలో తిప్పలు తప్పవని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.. అది ఎక్కడో కాదు జిల్లా కలెక్టరేట్ సముదాయంలోని ఎస్సీ అభివృద్ధి శాఖలో పరిస్థితి.

25ఏళ్లుగా ఇక్కడే. తిష్ట….

అతను పేరుకే అటెండర్ . … జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యాలయంలోనే తిష్ట వేసి కూర్చున్నాడు. గతంలో మిర్యాలగూడ డివిజన్ ఆఫీసుకు బదిలీ అయినప్పటికీ డిప్యుటేషన్ పేరుతో నల్గొండకు వచ్చి జిల్లా కార్యాలయంలో పాతుకుపోయాడు. ఎంతమంది సిబ్బంది బదిలీ అయినా అధికారులు వచ్చిపోతున్న ఆయన మాత్రం ఇదే కార్యాలయంలో పనిచేస్తుంటాడు. ఇక్కడి నుంచి బదిలీ చేసేందుకు ఏ అధికారి కూడా సాహసం చేయట్లేదని తెలుస్తుంది. ఒక కార్యాలయంలో పనిచేసే నాలుగో తరగతి సిబ్బంది తన సర్వీసులో 70 శాతం ఒకే చోట పని చేయడం అంటే చాలా అరుదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనను ఇక్కడి నుంచి బదిలీ చేయడానికి యంత్రాంగం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు వారికే తెలియాలి..

ఆరోపణలు అనేకం….
జిల్లా కార్యాలయంలో పనిచేసే అటెండర్ పనితీరుపై ఆ కార్యాలయంలో అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి ఒక సిబ్బంది రిటైర్మెంట్ అయితే అతని మొత్తం బిల్లులు పాస్ కావాలంటే 50 నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేస్తుంటారని సమాచారం. సిబ్బందికి సంబంధించిన ఏ చిన్న పని కావాలన్నా చేతులు తడపనిదే పనిచేయడమే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా కార్యాలయంలోని ఆయా సెక్షన్లలో ఏ ఫైలు ఎలా రాయాలో కూడా సిబ్బందికి తనే సూచనలు ఇస్తుంటారని వినిపిస్తోంది జిల్లా అధికారి టేబుల్ ముందు కూడా ఉండని ఫైల్ తాను కూర్చునే చోట కుప్పలు తెప్పలుగా ఫైళ్లు ఉంటాయని ఆఫీసులో అందరూ గుసగుసలాడుతున్నారు. జిల్లా అధికారి నూతనంగా వచ్చిన ఆయనకు కార్యాలయంలోని సిబ్బందిపై వార్డులపై లేనిపోని అనుమానాలు కలిగేలా చాడీలు చెబుతూ చెవుల కొరుకుతారని ప్రచారం జరుగుతుంది. తనకు నచ్చని వారు ఎవరైనా ఉంటే వాళ్ల అంతు చూసే వరకు వదలడని తెలుస్తోంది.
మొత్తంగా ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యాలయాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని నడిపిస్తున్నాడని జోరుగా చర్చ సాగుతోంది. ఒక అటెండర్ 25 ఏళ్లకు పైగా ఒకచోట ఎలా పనిచేస్తారో…. అతనిపై కార్యాలయంలో వస్తున్న అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించాలని కోరుతున్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking