కాంగ్రెస్ పార్టీ విజయ బేరి సభను జయప్రదం చేయండి – జగ్గారెడ్డి
శేరిలింగంపల్లి, అక్షిత ప్రతినిధి :
ఈ నెల 17 నాడు తుక్కుగూడలో నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ విజయ బేరి సభను జయప్రదం చేయాలనీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని చందానగర్ లోని శ్రీదేవి దీయేటర్ లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జెరిపేటి జైపాల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి అయన ముఖ్యతిధిగా హాజరై మాట్లాడుతూ తుక్కుగూడలో నిర్వహించే విజయబేరి సభకు సోనియా గాంధీ వస్తున్నందున నియోజకవర్గం లోని నాయకులకు, కార్యకర్తలకు సమాచారం ఇచ్చినప్పటికి కొందరు రాలేకపోయినప్పటికీ, ఇక్కడికి వచ్చిన వారందరు వీలైంత ఎక్కువ మందిని సభకు తీసుకురావాలని సూచించారు. జైపాల్ మాట్లాడుతూ 10 వేల నుండి 20 వేల మందిని తరలివస్తామని అందరం కలిసి పనిచేస్తామన్నారు.కాంగ్రెస్ పార్టీలో 1978 నుండి అంకిత భావంతో పనిచేసే వాడినని జెండా వదిలే ప్రసక్తే లేదని,. ఆనాటి నుండి నేటి వరకు అన్ని కార్యక్రసమాలు చేశామని, ఎమ్మేల్యే గా టికెట్ ఇస్తే పార్టీ శ్రేణుల సహాకారం తో శేరిలింగంపల్లి లో కాంగ్రెస్ జెండా ఎగుర వేస్తామని తెలిపారు. డివిజన్ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వీలైంత ఎక్కువ మందిని తీసుకురావాలని సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఓ.బి.సి సెల్ ప్రెసిడెంట్ హరికిషన్ మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు సురేష్ నాయక్ ,ఎస్.కే ఖాజా పాషా
హైదరనగర్ డివిజన్ అధ్యక్షులు లింగారెడ్డి, హాఫిజ్ పేట్ అధ్యక్షురాలు రేణుక , సుజాత, శాంత
లింగంపల్లి డివిజన్ అధ్యక్షులు జహంగీర్, లతీఫ్
చందానగర్ డివిజన్ అధ్యక్షులు అలీ, గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షులు భరత్ గౌడ్
, అల్విన్ కాలనీ అధ్యక్షులు శ్రీనివాస్ రావు ,
వివేకానగర్ డివిజన్ యాదగిరి,, యూత్ కాంగ్రెస్ నాయకులు సౌందర్ రాజన్
అయ్యాజ్ ఖాన్, కాంటెస్టేడ్ కార్పొరేటర్ నగేష్ నాయక్,
మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు సుజాత, బి. శాంత, సంగీత, వహీదా, మోసిన్, సోషల్ మీడియా కో. ఆర్డినేటర్ కవిరాజు, ఆవుల రవి, ఎన్ ఎస్ యూ ఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు