బాబు అక్రమ అరెస్ట్ తగదు

*చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండించిన అఖిలపక్ష నాయకులు.*

*చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా శనివారం కోదాడలో అఖిలపక్ష నాయకులు,  ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.*

*మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు*

*కోదాడ అక్షిత ప్రతినిధి*

అవినీతికి తావు లేకుండా 14 సంవత్సరాలు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసిన చంద్రబాబు నాయుడును అక్రమ అరెస్టును ముక్తకంఠంతో  అఖిలపక్ష నాయకులు ఖండించారు.  గురువారం కోదాడ పట్టణంలోని పబ్లిక్ క్లబ్ లో మాజీ డిసిసిబి చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష నాయకుల సమావేశంలో మాజీ శాసనసభ్యులు బారాస రాష్ట్ర నాయకులు వేనేపల్లి చందర్ రావు పాల్గొని మాట్లాడారు. నిత్యం సమాజం కోసం సమాజ శ్రేయస్సు పై పోరాడిన చంద్రబాబు అరెస్టుపై ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అవినీతి జగన్ కావాలని చంద్రబాబు నాయుడు పై అక్రమ కేసులు పెట్టి కక్షపూరితంగా వ్యవహరిస్తూ రాక్షసానందం పొందుతున్నారని అన్నారు. నేడు హైదరాబాద్ ఇంతగా అభివృద్ధి చెందిందంటే నాడు ముఖ్యమంత్రిగా ఆయన చేసిన కృషి ఫలితమైనని అన్నారు. హైదరాబాదులో ఐటీ ఉద్యోగులందరూఅరెస్టును ఖండించారని, అఖిలపక్ష నాయకులు, ప్రజా సంఘాలు, సానుభూతిపరులు, ప్రజలందరూ శాంతియుతంగా శనివారం ఉదయం 10 గంటలకు ఖమ్మం క్రాస్ రోడ్ నుండి రంగా థియేటర్ వరకు చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా జరగబోవు  ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అఖిలపక్ష నాయకులు ఓరుగంటి ప్రభాకర్, నంబూరి సూర్యం,కనగాల వెంకటరామయ్య,బొలిశెట్టి కృష్ణయ్య, మేకల శ్రీను,పిల్లుట్ల శ్రీనివాస్,ఈదుల కృష్ణయ్య, రావెళ్ల సీతారామయ్య, ఏపూరి రాజు,పెదనాటి వెంకటేశ్వరరావు,సైదా నాయక్, అంబడి కర్ర శ్రీనివాసరావు,సాతులూరి హనుమంతరావు,బొలిశెట్టి నాగేంద్రబాబు,బతినేని హనుమంతరావు,పుల్లూరి అచ్చయ్యతోట శ్రీను,ఉపగండ్ల శ్రీను,పాలూరి సత్యనారాయణ, దండా వీరభద్రం,ఉన్నం హనుమంతరావు, జనపనేని కృష్ణ, వేమూరి సురేష్, సామినేని రమేష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking