*రామన్నపేటలో విశ్వకర్మ జయంతి ఉత్సవాలు*
నకిరేకల్, అక్షిత ప్రతినిధి :
మండల విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శ్రీ శ్రీ శ్రీ విశ్వకర్మ భగవాన్ జయంతి ఉత్సవాలను రామన్నపేట పాత బస్టాండ్ శ్రీ శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవస్థానంలో విశ్వకర్మ భగవాన్ పూజా కార్యక్రమం విశ్వకర్మ జెండా ఆవిష్కరణ కార్యక్రమం అంగరంగా వైభవంగా నిర్వహించడం జరిగింది పూజ అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షులు మారోజు అనంత చారి మండల స్వర్ణకార సంఘం అధ్యక్షులు జిల్లా ఉపాధ్యక్షులు కన్నెకంటి వెంకటేశ్వరాచారి జిల్లా కార్యదర్శి చోల్లేటి పాండురంగాచారి మాజీ సర్పంచ్ మధుబాబు వెల్లంకి మాజీ సర్పంచ్ కూరెళ్ళ నరసింహచారి కాంజోజు శ్రీనివాస చారి శానగొండ వెంకటాచారి కొల్లోజు నరసింహచారి(సుచిత్ర) మారోజు రాఘవాచారి గుంటోజు సైదాచారి దశరథచారి చేన్నోజు బాబుచారి పురోహితులు బేతోజు సత్యనారాయణ శాస్త్రి వెలకుర్తి భూషణ చారి శశి పంతులు చెల్లెటి నరేష్ చారి తదితరులు పాల్గొన్నారు