విజయభేరికు కదిలిన బీఎల్ ఆర్ శ్రేణులు

విజయభేరికు బిఎల్అర్ ఆధ్వర్యంలో… పల్లె వాడ నుండి భారీగా కదిలిన కాంగ్రెస్ శ్రేణులు
*మిర్యాలగూడ నుండి కార్లు, జీపులు, బస్సులలో భారీ ర్యాలీగా
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ విజయభేరి బహిరంగ సభకు సామాజికవేత్త, మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్ ఆధ్వర్యంలో భారీ జన సమీకరణతో ఆదివారం వేలాదిగా విజయభేరికి కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు, బిఎల్ఆర్ బ్రదర్స్ కదిలారు. మిర్యాలగూడనియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు కాంగ్రెస్ శ్రేణులు, బిఎల్ఆర్ బ్రదర్స్ తో పాటు అభిమానులు పల్లె పల్లె నుంచి విజయభేరి బహిరంగ సభకు తరలి వెళ్లడంతో కాంగ్రెస్ లో నూతన ఉత్తేజం నెలకొంది. అపూర్వ స్పందనపై కాంగ్రెస్ నేత బిఎల్ఆర్ మాట్లాడుతూ
తెలంగాణ ప్రదాత తల్లి సోనియమ్మ రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందన్నారు.
జరగనున్న ఎన్నికలో మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేసి సత్తా చాటుదామన్నారు. ఆయన వెంట డిసిసి ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, కౌన్సిలర్లు దేశిడి శేఖర్రెడ్డి, కొమ్ము శ్రీనివాస్, క్రికెటర్ జానీ, జి.రామకృష్ణ పి. అనితా, కె.నాగలక్ష్మి,, కాంగ్రెస్ పార్టీ వార్డు ఇన్చార్జులు మోయి జ్, అబ్దుల్లా, మస్తాన్, శ్రీనివాస్ పాదూరి ప్రసాద్, సర్పంచ్ అంజిరెడ్డి, ఎంపిటిసిల జిల్లా ప్రధనకార్యదర్శి బెజ్జం సాయి నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ శ్రేణులు, బిఎల్ఆర్ బ్రదర్స్ భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. మిర్యాలగూడ పట్టణం ఎన్ఎస్పి క్యాంప్ రాజీవ్ స్టేడియం నుంచి భారీ సంఖ్యలో కార్లు, జీపులు, బస్సులలో శకుంతల టాకీస్, ఆర్టీసీ బస్టాండ్, రాజీవ్ చౌక్ మీదుగా రాంచంద్రగూడెం వై జంక్షన్ నుండి హైదరాబాద్ వైపు వాహనాలతో భారీ ర్యాలీగా వెళ్లారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking