తెలంగాణ విలీన దినోత్సవం

తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో తెలంగాణ విలీన దినోత్సవం

ఖమ్మం/ అక్షిత బ్యూరో :

తెలంగాణ తొలి మలిదశ ఉద్యమకారుల ఆధ్వర్యంలో తెలంగాణ విలీన దినోత్సవం ఖమ్మంలో ఘనంగా నిర్వహించారు.1969 సీనియర్ తెలంగాణ ఉద్యమ నాయకులు మెరుగు పుల్లయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు.అమరవీరుల కుటుంబాల ఉద్యమకారుల అభివృద్ధి కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వారికి పెన్షన్ సౌకర్యం కల్పించాలని జెసి కి మెమోరాండం ఇచ్చారు.ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల సోమయ్య మాట్లాడుతూ నిజం నియంత ఉక్కు పాదాలను ఎదిరించి స్వేచ్ఛ స్వాతంత్రాలు పొందిన తెలంగాణకు 75 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఒకసారి వెనుకకు తిరిగి చూసుకుంటే ఎటుచూసినా హృదయ విధారక ద్యశాలు తప్ప మరొకటి కనిపించడం లేదు ఈ 75 ఏళ్లలో వివిధ రాజకీయ పార్టీలు తమ ఇష్టానుసారంగా తెలంగాణను దోచుకున్నాయి.ఆనాడు నిజాం రాచరికపు దోపిడీ పాలనలో ఏడు తరాలు 224 నాలుగేళ్లు తెలంగాణను జలగల పీల్చి పిపి చేశారు. ఆఖరి నవాబ్ మీరు ఉస్మాన్ అలీ ఖాన్ పాలనలో మానవతకు నాగరికతకు తిలోదకాలు ఇచ్చి మతోన్మాద విష జ్వాలలతో బుస కొడుతూ కాసిం రజిని నాయకత్వంలోని రజాకార్ల మూకలు తెలంగాణ ప్రజల మీద గొర్లమందల తొడలు పడ్డట్టుగా. గృహ దానాలు దోపిడీలు మానభంగాలతో అతినీచమైన రాక్షస కృత్యాలతో బలవంతపు వసూలతో వెట్టిచాకిరితో తెలంగాణ ప్రజలను దోచుకున్నారు అదే సమయంలో రజాకార్లకు దీటుగా స్థానిక భూస్వాములు దొరలు పేదల భూములు లాక్కోవడం వందలాది మంది ఆడవారిని గడిలలో బంధించి ఎట్టి చాకిరితో పాటు వారిపై అత్యాచారాలు చేయడం ఎదురు తిరిగిన వారిని హత్య చేసి గడియలలో పాతిపెట్టినారు.అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు తమ ఆత్మ గౌరవాన్ని మానప్రాణాలను కాపాడుకోవడానికి ఊరురా వాడవాడల రాళ్లు రప్పలు కర్రలు ఒడిశాలలు కొడవలు, గుడ్డలు ఇలా దొరికిన ప్రతి వస్తువును వాయిదాలుగా మలుచుకొని పోరాడారు తెలంగాణ తల్లులు రజాకారుల భారీ నుండి తమను తమ కుటుంబాలను కాపాడుకోవడానికి బానిస బంధాల విముక్తి కోసం తాము వంటల్లో వాడే కారంపొడిని ప్రధాన ఆయుధంగా వాడుకున్నారు.
తెలంగాణ ప్రాంతాన్ని విముక్తి చేసినందుకు సెప్టెంబర్ 17న పర్వదినంగా గుర్తించాలని తెలంగాణ సమాజం కోరుకున్నది సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్ వేలసార్లు సెప్టెంబర్ 17 విమోచన దినంగా జరపాలని అసెంబ్లీ సాక్షిగా కొట్లాడినారు ఉద్యమ కాలంలో కేసీఆర్ తెలంగాణ ప్రాంతం అంతట ఉద్యమ ఇన్చార్జీలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరిగి తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించి ప్రాంతీయమా జాతీయ అన్న విషయాన్ని పక్కన పెడితే నాటి ఉద్యమ నాయకుడు నేటి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ సెప్టెంబరు 17ని అధికారికంగా నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.ఆనాడు రాక్షస రాజ్యపాలనలో తెలంగాణ ఏ విధంగా తల్లడిలిందో అదే విధంగా సీమాంధ్ర వలస పాలకుల కబంధ హస్తాలు బంధించబడిన తెలంగాణను విడిపించడం కోసం ఒంటిమీద పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని భగభగ మండుతున్న తన శరీరము నిలువున కాలిపోతున్నా అమ్మ అని అనకుండా మా తెలంగాణ మాకు కావాలి మా ఉద్యోగాలు మాకు కావాలి అని ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీ పిల్లలైనా నినదించిన శ్రీకాంత్ చారి గాని ఆ తర్వాత యాదయ్య పోలీస్ కృష్ణయ్య ఇంకా 1200 మంది విలువ. ఆత్మబలి దానాలు చేసింది ఎవరికోసం 200 స్పీడ్ తో వస్తున్న రైలుకి ఎదురెళ్లి ప్రాణాలు అర్పించింది ఢిల్లీ వీధుల్లో ఊరికి ఏలాడింది తెలంగాణ కోసం కాదా వేలాదిమంది ఉద్యమకారులు కేసుల్లో ఇరుక్కుని లాఠీలోకి తూటాలకు భలే జీవితాలను నాశనం చేసుకున్నది ఉస్మానియా ఉరిమింది కాకతీయ గర్జించింది తెలంగాణ కోసం కాదా. ఉద్యోగులు పెండౌన్ చేసింది సకలజనుల సమ్మె సాగరహారం మిలియన్ మార్చ్ సడక్బన్ రైల్వే రాస్తారోకో వంటివన్నీ తెలంగాణ కోసం కాదా ఇన్ని వర్గాల వారు త్యాగాలు చేసి పోరాడి 1200 మంది ప్రాణాలు బలిపెట్టి సాధించిన తెలంగాణలో ఈ సమంత అయిన పాత్రలేని నాయకులు ఉద్యమకారులను కొట్టించి కేసులు పెట్టించి ద్రోహులు తెలంగాణ సంపదలతో అందలమెక్కి అనుభవిస్తున్నారు ఈనాడు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగాలు రాక నిరాశతో నిరుద్యోగులు ఉరివేసుకొని చనిపోయిన అప్పుల పాలయి సర్వస్వం కోల్పోయిన రైతులు ఉద్యమకారులు ఆత్మహత్యలు చేసుకున్న ఓదార్చటానికి సీఎం గారికి టైం ఉండట్లేదు ఆర్థికంగా ఆదుకోవడానికి కథనాలు డబ్బులు ఉండట్లేదు కానీ మరి పంజాబ్ రైతులకు బీహార్ కార్మికులకు ఇవ్వటానికి డబ్బులు ఎక్కడి నుండి తెచ్చారు తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని డిమాండ్ చేస్తున్నాము అయినవాళ్లకు ఆకుల్లో కాని వాళ్ళకి కంచాల్లో అనే సామెత రుజువు చేశారు బ్రిటిష్ వలస పాలకుల దోపిడీ అణిచివేతల నుండి భారతదేశం ముస్లిం రాజుల పాలనలో కాసింహ్రూ దోపిడీ అణిచివేతల నుండి నైజాం దేశం విముక్తి జెంటి 75 సంవత్సరాలయింది ఎన్నో రాజకీయ పార్టీలు నాయకులు పరిపాలిస్తున్నారు. ఏ ఒక్క నాయకుడైన ప్రజల సమస్యల పైన విద్య వైద్యం. ఆకలి నివాసం నిరుద్యోగం వంటి సమస్యల మీద దృష్టి పెట్టి పరిష్కరించాలని ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్పించాలని కృషి చేశారా తమ స్వప్రయోజనాల కోసం ప్రజలను అజ్ఞానంలోకి ఎన్నటి మతవిద్వేషాలు రెచ్చగొడుతున్నారు పైగా. పోరాడి సాధించుకున్న అక్కులను కాలగర్భంలో కలిపేస్తున్నారు స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లయిన ఆ పొలాలు పేదవాడికి అందని ద్రాక్ష లాగానే ఉండిపోయాయి కాలం గడిచే కొద్దీ పాలన గాని సంపద గాని కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లి పోతుంది ఇప్పటివరకు ఈ పాలకుల వలన భారత ప్రజలకి మనకి వనకూరింది ఏమీ లేదు చూసుకో వాగ్దానాలు శూన్య హస్తాలు తప్ప ఇకనైనా ఈ దేశాన్ని గాని రాష్ట్రాన్ని గాని కాపాడవలసిన బాధ్యత మేధావులు యువత ప్రజలందరి మీద ఉందని అందరు అప్రమత్తం కావాలని తెలంగాణ ఉద్యమకారుల తరఫున భక్తుల సోమయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ సీనియర్ ఉద్యమ నాయకులు మెరుగు పుల్లయ్య జాతీయ జెండా ని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ ఉద్యమ నాయకులు మాధవ శ్రీనివాసరావు, కోయ వెంకట్ నారాయణ, అంబాల రామారావు, మెరుగు పుల్లయ్య, తాప్సి లింగయ్య, పురపాటి కృష్ణమూర్తి, తీగల వెంకటేశ్వర్లు, కొత్త వెంకటరెడ్డి, తోట వెంకటనారాయణ, ఉళ్లోజు వెంకన్న, కొర్రి ముత్తయ్య మోదుగు సూర్యకిరణ్ రాజేష్ వడ్డే పైన వెంకటేశ్వర్లు యాదన్న మోహన్ రావు దువ్వాడ రామారావు నారబోయిన వీరభద్రం ఉన్నం వెంకటేశ్వర్లు సత్యనారాయణ ప్రకాష్ రావు భువనగిరి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking