తుమ్మల రాజకీయ ప్రస్తానానికి మరో అడుగు…ఇది కాంగ్రెస్ కు ముందడుగు”
-లోడిగ వెంకన్నయాదవ్. సామాజిక వేత్త (పాలేరు)
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
తుమ్మల 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితం నందు కాంగ్రెస్ పార్టీ లో చేరడం ఖమ్మం జిల్లా రాజకీయాలలో ఒక చారిత్రక ఘట్టంగా అభివర్ణించవచ్ఛు.అంతేకాదు తుమ్మల జీవితంలో మరో అడుగు అది కాంగ్రెస్ పార్టీకి ఒక ముందడుగు అని కూడ ప్రజలు విశ్లేస్తున్నారు. దేశంలో ఏ రాజకీయ నాయకుడైన తన స్వలాభాపేక్షతో తనకు అనుగుణంగా రాజకీయ నిర్ణయాలు తీసుకొంటారు.కాని తుమ్మల ప్రమేయం లేకుండా కేసీఆర్ చేసిన రాజకీయ ద్రోహనికి ప్రజలే ఆగ్రహంతో ఉప్పొంగి ఉవ్వెత్తున నిరసన తెలిపి తుమ్మల రాజకీయాలు నుండి నిష్క్రమించకుండా బాసటగా నిలబడ్డారు. తుమ్మల ప్రజా క్షేత్రం లో లక్ష్యానికి అనుగుణంగా రాజకీయ విజేతగా నిలబెట్టి గండుగులపల్లి పంపాలని ప్రజలు నిర్ణయించారు.తిరిగి ఎన్నికల బరిలో నిలబడి పోటీ చేయాలి మీకు జరిగిన రాజకీయ అన్యాయానికి మేము మీకు అండగా ఉన్నాం అని పార్టీ లకు రాజకీయాలకు అతీతంగా రోడ్లపైకి వచ్ఛి ప్రజలు, అభిమానులు స్వాగతం పలికారు.ఇది గమనించిన తుమ్మల ప్రజల యొక్క ఆకాంక్షకు అనుగుణంగా నేను ఎన్నికల్లో పోటీ చేస్తాను అని ప్రజలను ఉద్దేశించి భావోద్వేగాలతో ప్రజల మద్య తన అభిప్రాయం వెలిబుచ్చారు.అంతవరకూ బాగానే ఉన్నా ప్రజలే కాంగ్రెస్ కు వెళ్ళాలి తిరిగి పోటీ చేయాలి అని ప్రజలే ఒక నిర్ణయం తీసుకున్నారు.

ప్రజానిర్ణయానికి అనుగుణంగా కాంగ్రెస్ లోకి వెళ్ళటానికి తుమ్మల నిర్ణయం తీసుకొనక తప్పలేదు అని చెప్పవచ్చు.
తుమ్మల రాజకీయ జీవితం తరిచి చూస్తే తన 40 సంవత్సరాల రాజకీయ పోరాటం ఒక పూల బాట అని చెప్పడానికి వీలులేదు. ఎందుకంటే సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన తుమ్మల రాజకీయాలకు ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితుడై రాజకీయ అరంగేట్రం చేసిన తుమ్మల పోటీ చేసిన మొదటి సారే ఓటమి పాలయ్యారు.అంతే కాదు కాంగ్రెస్ కురువృద్ధుడు జలగం వెంగళ్ళరావు కుటుంబానికి ఎదురొడ్డి రాజకీయాలలో నిలబడడం అంత ఆశామాసి కాదు.దానికి తోడు ఆనాడు ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టు పార్టీల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలతో కలిసి పనిచేయాలని యన్ టి ఆర్ నిర్ణయం తీసుకొనటం తుమ్మలకు పెను సవాల్ గా మారింది. అటు జలగం కుటుంబంను ఇటు కాంగ్రెస్ ను ఎదుర్కొంటు మరోపక్క మిత్రపక్షాల చెలిమి కొనసాగించడం తుమ్మలకు కత్తిమీద సాములా అయింది. మరోవైపు పార్టీ లో తెలుగుదేశం పార్టీ వర్గపోరుతో కోనేరు నాగేశ్వరరావు గ్రూప్ ను తట్టుకొని పార్టీలో ముందుకు సాగిన వైనం తుమ్మలను రాజకీయాలలో రాటుదేలేలా చేశాయి అనవచ్ఛు.దీనికి తోడు ఏదైతే యన్ టి ఆర్ అభిమానంతో రాజకీయాలలోకి వచ్ఛారో ఆనాటి లక్ష్మీ పార్వతి విదానాలకు వ్యతిరేఖంగా యన్ టి ఆర్ ను వ్యతిరేఖించవలిసిన సంకటిత పరిస్థితి ఎదుర్కొంటు చంద్రబాబు తో కలిసి నడవక తప్పలేదు. తన అభిమానాన్ని చంపుకొని చంద్రబాబు తో ముందుకు సాగే రాజకీయ పరిస్థితులు తుమ్మలను రాజకీయ అనుభవశాలిగా మలుసుకొనుటకు దోహదపడింది.తుమ్మలను అడుగు అడుగు నా రాజకీయాలు వెన్నంటి వెంటాడుతునే ఉన్నాయి. అనుక్షణం తనని తాను పరీక్షించుకొని రాజకీయ అడుగులు వేసే సంకటిత స్థితి తుమ్మలది అని చెప్పవచ్చు. ఎందుకంటే తద్వారా జరిగిన తెలంగాణ రాజకీయ పరిణామాలు రాష్ట్ర విభజన అనంతరం తెలుగుదేశం పార్టీని వీడి కేసీఆర్ తో చేతులు కలపడానికి కన్నీటి పరియాంతం అయ్యారు తుమ్మల.ఆనాటి టిఆర్ యస్ పార్టీ లో చేరి ఖమ్మంజిల్లా ముఖ చిత్రం మార్చేశారు అభివృద్ధి ప్రదాతగా పేరుతెచ్ఛుకొన్నారు. తదుణుగుణంగా జరిగిన ఎన్నికల్లో తుమ్మల రాజకీయ జీవితం నీలి నీడలా వెంటాడి రాజకీయ కుట్రకు పాలేరు లో బలైపోయి ఓడిపోయారు తుమ్మల. రాజకీయ విశ్రాంతి తీసుకుందామని అనుకుంటున్న సమయంలో తుమ్మల ఓటమి ఎంతో బాధించింది. తాను ఆశించిన సీతారామా ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది లక్షల ఎకరాల కల సాకారం కాకుండా తన రాజకీయ జీవితం ముగించడమైనది అని మదనపడుతున్న తరుణంలో ఒక్కసారిగా ప్రజలనుండి విశేషమద్దతు లభించి ప్రజలు తుమ్మలకు అండగా నిలబడి కాంగ్రెసు పార్టీలో చేరేలా ప్రజలు బాసటగా నిలబడ్డారు. ఇలా తుమ్మల రాజకీయ కష్టాలకు అవమానాలకు ఓటమి జరిగిన ప్రతీసారి తుమ్మలకు ప్రజలు అభిమానులు వెన్నంటి నిలబడి తన రాజకీయ జీవితాని నాలుగు దశాబ్దాలుగా ప్రజలు అభిమానులు అండగా నిలడడ్డారు అనడం లో అతిశయోక్తి లేదు.ఇంతటి సుదీర్ఘ అభిమానులు కలిగిన రాజకీయ నాయకుడు దేశంలో లోనే అరుదైన నాయుడు తుమ్మల అని చెప్పడం లో సందేహం లేదు.ఇప్పుడు తన రాజకీయ అనుభవం తో కాంగ్రెస్ నాయకులను కలుపుకుని ఒకే తాటి పైకి తెచ్ఛి ప్రజలను చైతన్య పరిచి ఖమ్మం ఉమ్మడి జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు గెలిపించడంలో కీలకపాత్ర పోషించి తాను గెలిచి ఇతరుల గెలుపు కొరకు కృషి చేసి శభాస్ తుమ్మల అనిపించుకోవల్సిన గురుతరబాద్యత తన పై ఉంది. అంతే కాకుండా కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకొనిరావడంలో ఎంతో క్రియాశీలకంగా జిల్లాలో పనిచేయవలిసిన అవసరం తుమ్మల భుజస్కంధాలపై ఉంది. ముఖ్యంగా రాజకీయ పెద్దన్నగా భట్టివిక్రమార్క తుమ్మల కంటే ముందు కేసీఆర్ పై రాజకీయ దూకుడు తో పనిచేస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా సీనియర్ నాయకులతో కలిసి పనిచేసి సమిష్టి కృషితో జిల్లాలోని పదికి పది స్థానాలు కాంగ్రెస్ కు కానుకగా ఇవ్వడం లో తుమ్మల రాజకీయ భూమిక ఎంతో కీలకం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సమిష్టి కృషి తుమ్మలకు కాంగ్రెస్ కు ఆశించిన విజయం సాధించి పెడుతుందని ఆశిద్దాం.