ఘనంగా మున్సిపల్ చైర్మన్ భార్గవ్ పుట్టినరోజు వేడుకలు..
👉 శుభాకాంక్షలు తెలిపిన జర్నలిస్టులు : రక్తదాన శిబిరం నిర్వహణ…
👉 తరలివచ్చిన కౌన్సిలర్లు అభిమానులు, బిఆర్ఎస్ శ్రేణులు…
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్, పట్టణ బిఆర్ఎస్ అధ్యక్షులు, తిరునగర్ భార్గవ్ పుట్టినరోజు వేడుకలు గురువారం మిర్యాలగూడ పట్టణంలోని పలు వార్డులలో ఘనంగా నిర్వహించారు. చైర్మన్ భార్గవ్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా టిఎన్ బి, ఆధ్వర్యంలో చైర్మన్ క్యాంపు కార్యాలయం వద్ద రక్తదాన శిబిరం నిర్వహించారు. కౌన్సిలర్లు, వార్డుల అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గల సభ్యులు, అభిమానులు, మిత్రబృందం, బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, పెద్ద సంఖ్యలో తరలివచ్చి చైర్మన్ భార్గవకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కేకులను కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. సీనియర్ జర్నలిస్టులు ఖాజ హామీదుద్దీన్, ఎండి అస్లాం, నరేందర్ రెడ్డి, నాజీముద్దీన్, బొంగరాల మట్టయ్య, మంద సైదులు, కందుల రాంప్రసాద్, చెన్నూరి రవి తదితరులు చైర్మన్ భార్గవ్ కు భోకే అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.