“మిర్యాల “కాంగ్రెస్ కు కొత్త టీం
మిర్యాలగూడ నియోజకవర్గంలో నూతన కమిటీలను నియమించిన డిసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్
*మిర్యాలగూడ పట్టణ అధ్యక్షులుగా గాయం
బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులుగా తలకొప్పుల సైదులు, పొదిల
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
మిర్యాలగూడ నియోజక వర్గానికి కొత్త టీం నియామకమైంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా పట్టణ, మండల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులను, నూతన కమిటీలను నియమిస్తూ నల్గొండ జిల్లా అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికల్లో జరుగనున్న నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ నాయక్ మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా నూతన కమిటీలను ఏర్పాటు చేయడం నియోజకవర్గం అంతటా చర్చించుకుంటున్నారు.

మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులుగా గాయం ఉపేందర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ గా పొదిల వెంకన్న యాదవ్, మిర్యాలగూడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులుగా తల కొప్పుల సైదులు, దామరచర్ల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులుగా పొదిల శ్రీనివాస్, వేములపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులుగా మాలి కాంతారెడ్డి, వర్కింగ్ వైస్ ప్రెసిడెంట్ గా తమ్మడబోయిన రామయ్య, మిర్యాలగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా కె.బసవయ్య గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కంచుకుంట్ల లింగయ్య యాదవ్, మాడుగులపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులుగా జి.వేణుగోపాల్ రెడ్డి, వర్కింగ్ వైస్ ప్రెసిడెంట్ గా బట్టు మాధవరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ గా పుల్లెంల నరసింహ, దామరచర్ల మండల కాంగ్రెస్ అధ్యక్షులుగా గాజుల శ్రీనివాస్, అడవిదేవులపల్లి మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా రమావత్ బాలునాయక్, అడవిదేవులపల్లి మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా గుండా శ్రీనివాస్ లను నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేశామని జిల్లా అధ్యక్షుడు శంకర్ నాయక్ పేర్కొన్నారు. వీరి నియామకాలు వెంటనే అమలులోకి వస్తాయన్నారు. నూతనంగా నియమించబడిన అందరూ జరగనున్న ఎన్నికల్లో మిర్యాలగూడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేసేందుకు సమిష్టిగా కృషిచేయాలని పిలుపునిచ్చారు.