*ఒకటో తారీఖున క్లబ్ లో జరిగే గద్దరన్న యాదిలో ఉద్యమకారుల సమ్మేళన సభను జయప్రదం చేయాలి*
*ఓయూ జేఏసీ అధ్యక్షులు కందుల మధు*
*కోదాడ, అక్షిత ప్రతినిధి :
స్థానిక పబ్లిక్ క్లబ్ ఆడిటోరియం లో గద్దర్ అన్న యాదిలో ఉద్యమకారుల సమ్మేళనం సభ గురించి ఈరోజు పాత్రికేయుల సమావేశం ఓయూ జేఏసీ అధ్యక్షులు కందుల మధు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు పాత్రికేయులతో మాట్లాడుతూ
తెలంగాణ ఉద్యమం లో విద్యార్థుల పోరాటం , తెలంగాణ కోసం అమరులైన అమరవీరులను స్మరిస్తూగద్దరన్న ప్రజా పోరాటలను , తెలంగాణ కోసం పోరుబాట పట్టికాలికి గజ్జె కట్టి ఊరూరా తిరిగి తెలంగాణ ప్రజలను చైతన్యం చేసిన విధానాన్ని గుర్తుచేసుకోవడం కోసం సమ్మేళన సభ ఏర్పాటు చేయటం జరిగింది అని వారు అన్నారు
ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ఉద్యమకారులకు 50% రిజర్వేషన్ కల్పించాలని,తెలంగాణ కోసం త్యాగాలు చేసి లాఠి చార్జ్ లకు, టియర్ గ్యాసులకు రబ్బరు బుల్లెట్లకు ఎదురెల్లి
జై తెలంగాణ అని నినదించి
జైలు జీవితం గడిపి
సర్వం కోల్పోయిన తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం అండగా నిలవాలని ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో 50% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ మున్ముందు ఇంకా పోరాటం చేస్తామని తెలియజేయడం జరిగింది అని కందుల మధు అన్నారు కార్యక్రమంలో పాల్గొన్న వారు టి ఎస్ యు ఓయూ ప్రెసిడెంట్ శ్రీకాంత్ యాదవ్, మునగాల మండల కో ఆర్డినేటర్ పోలంపల్లి బాబు, అనంతగిరి మండల కో ఆర్డినేటర్ రేపాకుల నరేష్ , చిలుకూరు మండల కో ఆర్డినేటర్ సురేష్ , పొలంపల్లి సైదులు, బాలేబోయిన ఉపేందర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు