గులాబీ గూటికి భారీ వలసలు
*వేములపల్లిలో బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు.
*గులాబీ కండువా కప్పి పార్టీలోనికి స్వాగతించిన ఎమ్మెల్యే
వేములపల్లి, అక్షిత ప్రతినిధి : మండలం కేంద్రం నుంచి కాంగ్రెస్ పార్టీకీ చెందిన 200 మంది కార్యకర్తలు స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వేములపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ అద్యక్షులు నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ చిర్ర మల్లయ్య యాదవ్ ల అద్వర్యంలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు, పార్టిలో చేరిన వారిని ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీ లోనికి స్వాగతించారు బిఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో దైద రాజు, పెదమాం వినోద్, పుట్టల చిన్న, పుట్టల శ్రీహరి, కోట గోపికృష్ణ, పగడాల నగేష్, బొస్క బాలకృష్ణ, దైదా మహేందర్, గుడుగుంట్ల కిరణ్, కళ్ళు శ్రీను, పెరపాక శ్రీను, దైద సత్యం, కదురు మురళి, మెరుగు సతీష్, బొస్క పరమేష్, దైద రాంబాబు, పుట్టల శ్రీను, పెదమాం ప్రవీణ్, గుండెపంగు సందీప్, పుట్టల వెంకన్న, పాల్వాయి సతీష్, బచ్చలకురి విజయ్, మొండికత్తి వీరస్వామి తదితరులు ఉన్నారు,ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలు ప్రజా సంక్షేమం కోసం సిఏం కె.సిఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు .రాష్ట్ర ప్రభుత్వం చేబడుతున్న కార్యక్రమాలకు చూసి ఇతర పార్టీల నుంచి కార్యకర్తలు, నేతలు తెరాస వైపు పరుగులు పెడుతున్నారని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేస్తోందన్నారు.కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల ద్వారా వేములపల్లి గ్రామానికి ఇప్పటి వరకు 52 కోట్ల 14 లక్షల 15 వేల 542 రూపాయలు మంజూరు అయ్యాయన్నారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు ఇరుగు వెంకటయ్య, మాలి ధర్మపాల్ రెడ్డి, మార్కెట్ కమిటి డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, అమిరెడ్డి శేఖర్ రెడ్డి, గ్రామ శాఖ అద్యక్షులు నాగవెల్లి శంకర్, జడ మట్టయ్య, పుట్టల సైదులు, దైద సౌలు, వల్లపుదాసు కిరణ్, గిరి, మండల మైనారిటీ అద్యక్షులు షేక్ జావీద్, వార్డు సభ్యులు గుండేబోయిన లక్ష్మయ్య, ఉగ్గే మునిశ్వర్, తోట సైదులు, మండల బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద జాన్సన్, పగడాల రవి, నకిరేకంటి కిషోర్, పుట్టల పౌల్, దుర్గారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.