నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం పరకాల యూనిట్ ఎన్నిక పూర్తి
– అధ్యక్షులుగా ఆట సారంగపాణి
– ప్రధాన కార్యదర్శిగా కె అశోక్ నియామకం
నకిరేకల్, అక్షిత ప్రతినిధి :
తెలంగాణ పంచాయతీరాజ్ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం పరకాల సమితి యూనిట్ గురువారం పరకాల ప్రభుత్వ బాలుర హై స్కూల్ లో యూనిట్ నూతన బాడీ ఎన్నికకై సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎన్నికల సమావేశంలో పరకాల, నడికుడ, శాయంపేట మండలాల నాలుగవ తరగతి ఉద్యోగులు హాజరై ఎన్నికలను ఏకగ్రీవంగా తీర్మానించి ఆమోదించారు. ఈ సమావేశంలో నూతన బాడీని ఎన్నుకోవడం జరిగింది. ఎన్నికైన నూతన బాడీ పదవి కాలం మూడు సంవత్సరాలు కొనసాగనుంది. కాగా ఇట్టి ఎన్నికకు జిల్లా అధ్యక్షులుగా చాగంటి రవి, సహాయ ఎన్నిక పరిశీలకుడుగా ఎస్ కే సంధాని మరియు జిల్లా నాయకులు హాజరై ఎన్నికల నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికకు ఎలక్షన్ అధికారిగా పెద్దగోడపాక జడ్పీఎస్ఎస్ జూనియర్ అసిస్టెంట్ నేరెళ్ల వెంకటేశ్వర్లు బాధ్యతవహించి ఎన్నికను సజావుగా నిర్వహించడం జరిగింది. ఎన్నిక కాబడిన నూతన అసోసియేట్ బాడీలో అధ్యక్షులుగా ఆట. సారంగపాణి, అసోసియేట్ అధ్యక్షులుగా కొత్తపెల్లి సదానందం, ఉపాధ్యక్షులుగా వనజ రాణి, ప్రధాన కార్యదర్శిగా కోమరాజు అశోక్, కోశాధికారిగా గోవిందు నవీన్, సంయుక్త కార్యదర్శిగా నేరెళ్ల విజయ్ కుమార్, కో ఆప్షన్ నెంబర్ గా జ్యోతి, శ్రీదేవిలు ఉన్నారు. తెలంగాణ పంచాయతీరాజ్ 4వ తరగతి ఉద్యోగుల పరకాల సమితి యూనిట్ శాఖలో ఎన్నిక కాబడిన ఈ సభ్యులు సమస్త పరకాల సమితి నాలుగో తరగతి ఉద్యోగుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారని ఎన్నికల అధికారి పెద్దకోడెపాక జడ్పీఎస్ఎస్ జూనియర్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు తెలుపుతూ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఇట్టి సమావేశంలో జిల్లా ఎన్నికల పరిశీలకులు చాగంటి రవి, ప్రధాన కార్యదర్శి ఎస్కే సందాని మరియు జిల్లా సంఘ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఈ సమావేశాన్ని విజయవంతం చేసినందుకు నూతన కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం మున్ముందు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే దిశగా జిల్లా బాధ్యులు, సభ్యులు మరియు సమితి యూనిట్ కార్యకర్తలు సహాయ సహకారాలు అందించాలని తెలియజేస్తూ ఎన్నికకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సమావేశాన్ని ముగించారు.