రూ.37 వేలు పలికిన గూడపూర్ లడ్డు

గూడపూర్ గ్రామ శివాలయ కమిటీ గణపతి లడ్డు వేలంపాట

– రూ.37000/- లకి కైవసం చేసుకున్న మేకల రవి – నిర్మల దంపతులు

– పూజ పండ్లుఫలాలు రూ.13000/- లకి నారబోయిన వెంకన్న – శంకరమ్మ దంపతులు

– వచ్చే సంవత్సరం విగ్రహదాతగా దేశిడి లక్ష్మణ్ – నీలిమ దంపతులు

నకిరేకల్, అక్షిత ప్రతినిధి :

జిల్లాలోని మునుగోడు మండలం, గూడపూర్ గ్రామ శివాలయం కమిటీ అధ్వర్యంలో గణపతి నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన గణపతి లడ్డు వేలంపాట లో పాల్గొని రూ.37000/- రూపాయలకి మేకల రవి – నిర్మల దంపతులు దక్కించుకున్నారు. నవరాత్రి ఉత్సవాలు భాగంగా పూజలు అందుకున్న పండ్లు ఫలాలు వేలంపాట చేయగా నారాబోయిన వెంకన్న – శంకరమ్మ దంపతులు రూ.13000/- లకి దక్కించుకోగా, వచ్చే సంవత్సరం ఏర్పాటు చేసే విగ్రహ ప్రతిష్ఠ కి విగ్రహ దాతగా దేశిడి లక్ష్మణ్ – నీలిమ దంపతులు ముందుగానే ప్రకటించారు. అనంతరం గణపతి ఊరేగింపు కార్యక్రమం ప్రారంభించి యువకులు డప్పు వాయిద్యాల నడుమ డ్యాన్సులు చేస్తూ, ఆడపడుచుల కొలటాలతో గ్రామస్థుల సమక్షంలో ఆనందంగా నిమజ్జన కార్యక్రమం పూర్తి చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ శివాలయ కమిటీ సభ్యులు, యువతి యువకులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking