చేర్యాల డివిజన్ సాధనకై జర్నలిస్ట్స్ దీక్ష

రెవెన్యూ డివిజన్ కోసం రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న పత్రిక విలేకరులు

చేర్యాల,అక్టోబర్ 01 అక్షిత ప్రతినిధి : చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని కోరుతూ చేర్యాల,మద్దూరు,కొమురవెల్లి, దూల్ మిట్ట మండలాలకు చెందిన ప్రింట్ మీడియా విలేకరులు రిలే నిరాహార దీక్షలో పాల్గొనగా,రిలే నిరాహార దీక్షలు 21రోజుకు చేరుకున్నాయి.ఈ సందర్భం గా పలువురు విలేకరులు మాట్లాడుతూ చరిత్ర కలిగిన చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధన కొరకు జేఏసి చెపట్టిన నిరవధిక దీక్ష కుమద్దతు గా మా వంతు కృషి చేస్తామని తెలిపారు.అదేవిధంగా డివిజన్ ప్రకటించేంతవరకు మా వార్తపరంగా పనిచేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల ప్రింట్ మీడియా విలేకరులు. మరియు జేఏసి చైర్మన్ రామగళ్ళ పరమేశ్వర్, కో చైర్మన్ పుర్మా ఆగం రెడ్డి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, ఏం అర్ పి ఎస్ జిల్లా అధ్యక్షుడు మల్లిగారి యాదగిరి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి బద్దిబడగ నర్సింహ రెడ్డి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు తడక లింగం, జేఏసీ నాయకులు అందే అశోక్, బొమ్మగొని అంజయ్య ,రిటైర్డ్ ఉపాధ్యాయులు పి నర్సయ్య, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బూరుగు సురేష్ గౌడ్, అంబటి అంజయ్య,సిద్ది లింగం తదితరులు సంఘీభావం తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking