*అన్ని వర్గాల అభివృద్ధి బిఆర్ఎస్ లక్ష్యం: ఎమ్మెల్యే చిరుమర్తి*
అక్షిత న్యూస్, చిట్యాల టౌన్ :
రాష్ట్రంలో అన్ని వర్గాలను అభివృద్ధి చేయడమే బిఆర్ఎస్ పార్టీ ప్రధాన లక్ష్యమని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం చిట్యాల మండలంలోని వెలిమినేడు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో భాగంగా 9 కోట్ల తో వెలిమినేడు నుంచి సిరిపురం ఇంద్రపాలనగరం వరకు చేపట్టనున్న బీటి రోడ్డు నిర్మాణ పనులకు, వెలిమినెడు గ్రామంలో 10 లక్షలతో చేపట్టనున్న బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు, 10 లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్డు నిర్మాణ పనులకు, 5 లక్షల నిధులతో చేపట్టిన యాదవ సంఘం భవన నిర్మాణ పనులకు మరియు 5 లక్షల నిధులతో చేపట్టిన ముదిరాజ్ సంఘం భవన నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతానికి జరిగిన ద్రోహాన్ని సీఎం కేసీఆర్ దృష్టిలో పెట్టుకొని తొమ్మిది ఏళ్ల పాలన కాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపించాడన్నారు దేశంలో మరే రాష్ట్రం కూడా ఇంత తక్కువ సమయంలో అభివృద్ధి సాధించింది లేదని చెప్పారు. ప్రతిపక్షాలు అధికార దాహంతో ఇష్టం వచ్చినట్లుగా అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వారి మోసాలను, కుట్రలను గుర్తించి ఓటుతోనే వారికి తగిన బుద్ధి చెప్పాలి అన్నారు. ఈసారి కూడా సీఎం కేసీఆర్ కు మద్దతు ఇచ్చి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధి ప్రధాన అజెండాగా పనిచేస్తూ నకరికల్లును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్న తనకు మద్దతిచ్చి గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొలను సునీత, జడ్పిటిసి సుంకరి ధనమ్మ, సింగిల్ విండో చైర్మన్ రుద్రారపు బిక్షపతి, ఆరూరి శ్రీశైలం, చింతకింది వెంకటేష్, మోహన్ రెడ్డి, సుంకరి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.