జర్నలిస్ట్ దత్తాత్రేయ మృతదేహాన్ని సందర్శించిన ఐజేయూ,టీయూడబ్ల్యూజే నేతలు

*జర్నలిస్ట్ దత్తాత్రేయ మృతదేహాన్ని* *సందర్శించిన ఐజేయూ,* *టీయూడబ్ల్యూజే నేతలు*

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ కేంద్రంగా గత ముప్పై ఏళ్లుగా ఈనాడు రిపోర్టర్ గా పనిచేస్తున్న దత్తాత్రేయ ఇవ్వాళ ఉదయం హఠాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు ఆడపిల్లలున్నారు.

ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) జాతీయ అధ్యక్షులు కే. శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీలు హిమాయత్ నగర్ లో దత్తాత్రేయ మృతదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. ఆర్థిక కష్టాల మధ్య దుర్భర జీవితాన్ని గడుపుతున్న దత్తాత్రేయ కుటుంబానికి తాము అండగా ఉంటామని, ప్రభుత్వ పరంగా తగు సహాయం కోసం కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking