జెపి తండా కావాలి… ప్లాస్టిక్ రహిత గ్రామం…
జడ్పిటిసి ఉమా వెంకటరెడ్డి……
నంగునూరు, అక్షిత ప్రతినిధి :
మంత్రి తన్నీరు హరీష్ రావు సొంత నిధులతో సిద్దిపేట నియోజకవర్గ ఉపాధి హామీ కూలీలందరికీ కూడా టిఫిన్ బాక్స్ లు అందజేస్తున్న విషయం తెలిసిందే జేపీ తండా గ్రామపంచాయతీలో జడ్పిటిసి ఉమా వెంకటరెడ్డి ఉపాధి హామీ కూలీలకు స్టీల్ వాటర్ బాటిల్, టిఫిన్ బాక్స్, బ్యాగులను పంపిణీ చేశారు. గాంధీ జయంతి సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి అనంతరం మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత గ్రామంగా పర్యావరణ కాలుష్యం రహిత గ్రామంగా జేపీ తండా తీర్చిదిద్దాలని ప్లాస్టిక్ ఎవరు వాడొద్దని ఆకుపచ్చ గ్రామంగా ఆదర్శ గ్రామంగా ఉండాలని మహిళలు అందరికీ తెలిపారు.మంత్రి తన్నీరు హరీష్ రావు సహకారంతో జేపీ తాండ ను అభివృద్ధి చేసుకుంటున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఎడ్ల జోష్ణ నరసింహ రెడ్డి ,గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు కార్యదర్శి అంగన్వాడీ టీచర్ మహిళలు తదితరులు పాల్గొన్నారు.