బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్

*బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్*

*బీఆర్ఎస్‌ కు మునిసిపాలిటీ వైస్ చైర్ పర్సన్ శ్రీలతారెడ్డి రాజీనామా*

*బిజెపి నుంచి పోటీకి సిద్దం?

నేరేడుచర్ల, అక్షిత న్యూస్ :

నేరేడుచర్ల వైస్ చైర్మన్, 13వ వార్డు కౌన్సిలర్ చల్లా శ్రీలతా రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తూ బుధవారం నాడు నేరేడుచర్ల మున్సిపల్ కార్యాలయంలో రాజీనామా పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డికి అందజేశారు. అనంతరం పట్టణ బిఆర్ఎస్ పదవికి కూడా రాజీనామాను పట్టణ ప్రధాన కార్యదర్శి, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడికి రాజీనామా పత్రాన్ని పంపినట్లు విలేకరుల సమావేశంలో తెలిపారు.

బిజెపిలో చేరుతున్నట్లు చెప్పకనే చెప్తూ, బిఆర్ఎస్ పార్టీ ద్వారా వచ్చిన అన్నీ పదవులకు రాజీనామా చేసినట్లు ఆమె తెలిపారు. మండల కీలక బీఆర్ఎస్ నాయకులు పార్టీకి రాజీనామా చేసి ఆమె వెంట వస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీ పట్టణ పదవిలో ఉంటూ పార్టీ సిద్ధాంతాల కట్టుబడి ఉన్నానని, పార్టీ కట్టుబాట్లకు కట్టలుతెంచే విధంగా ప్రవర్తించిన నాయకులకి సరైన సమాధానంగా త్వరలో తన రాజకీయ భవిష్యత్తు ప్రణాళిక ప్రకటిస్తానని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking