కేకేసీ రాష్ట్ర వైస్ చైర్మన్ గా
ఎస్ కృష్ణ వేణి
న్యూ ఢిల్లీ, అక్షిత ప్రతినిధి :
ఆల్ ఇండియా అన్ ఆర్గనైజుడు వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ కాంగ్రెస్ (కేకేసీ) తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్ గా తుంగతుర్తి కాంగ్రెస్ నాయకురాలు ఎస్ కృష్ణవేణి ఇస్మాయిల్ నియమితులయ్యారు. కేకేసీ జాతీయ చైర్మన్ డాక్టర్ ఉదిత్ రాజ్ గురువారం న్యూఢిల్లీ జాతీయ కార్యాలయంలో కృష్ణవేణికి నియామక పత్రం అందజేశారు. ఈ సందర్బంగా డాక్టర్ ఉదిత్ రాజ్ మాట్లాడుతూ అసంఘటిత రంగంలో కార్మికుల హక్కుల కోసం కేకేసీ పోరాడుతుందని, రాజ్యాంగ పరిరక్షణ కోసం ఉద్యమిస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేకేసీ పటిష్ఠతకు చైర్మన్ కౌశల్ సమీర్, వైస్ చైర్మన్ ఎస్ కృష్ణవేణి నేతృత్వంలో సమిష్టి కృషితో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

కేకేసీ బలోపేతానికి కృషి చేస్తా…
తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్ గా అవకాశం కల్పించిన జాతీయ చైర్మన్ డాక్టర్ ఉదిత్ రాజ్ కు నియామకానికి సహకరించిన రాష్ట్ర చైర్మన్ కౌశల్ సమీర్ కు కృష్ణ వేణి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సంఘo బలోపేతం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఆన్నారు. జాతీయ, రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి ధన్య వాదాలు తెలిపారు.