ఖమ్మం బిసి స్టడీ సర్కిల్ లో శిక్షణ పొందిన 44 మందికి పోలీస్ ఉద్యోగాలు
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
ఖమ్మం బిసి స్టడీ సర్కిల్ ద్వారా పోలీస్ కానిస్టేబుల్ ఉచిత శిక్షణ పొందిన అభ్యర్ధులలో 44 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు.ఇందులో 37 మంది పురుషులు 7 మంది మహిళలు విజయం సాధించారు.మొత్తం 106 మంది శిక్షణ తీసుకొనగా 44 మంది విజయం సాదించినారు.
19 మంది సివిల్ కానిస్టేబుల్ 6 మంది ఏఆర్ కానిస్టేబుల్ 1 బెటాలియన్ 2 ఎక్సైజ్ కానిస్టేబుల్ 1 ఫైర్ కానిస్టేబుల్ 3 స్పెషల్ ఫోర్సు. 12 టి ఎస్ ఎస్ పీ కానిస్టేబుల్ కు సెలెక్ట్ అయ్యారు.ఇందులో బిసీ- 30 ఎస్సీ-04 ఎస్టీ – 08 ఈబిసి -02 మంది వున్నారు. పట్టుదల క్రమశిక్షణ నిపుణులైనటువంటి అధ్యాపక బృందం చేత శిక్షణ ఇవ్వడం లైబ్రరీ స్టడీ హాల్ సౌకర్యం ఉండడం వలన ఎక్కువ మంది అభ్యర్థులు విజయం సాధించారు.ఉత్తీర్నత సాధించిన అభ్యర్ధులకు జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ జిల్లా బిసి సంక్షేమ శాఖా అధికారి జి జ్యోతి బిసి స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి శ్రీలత అభినందనలు తెలిపారు.