మాదిగల విశ్వరూప మహా పాదయాత్రను విజయవంతం చేయండి
– పోలేని యాదయ్య మాదిగ
– బుషిపాక శాంత కుమార్ మాదిగ
నాంపల్లి, అక్షత న్యూస్:
మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తా లో ఎమ్మార్పీఎస్ నాంపల్లి మండల అధ్యక్షులు బుషిపాక శాంతి కుమార్ మాదిగ ఆధ్వర్యంలో విశ్వరూప మహాసభ కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మునుగోడు నియోజకవర్గం పర్యవేక్షకులు పోలేని యాదయ్య మాదిగ హాజరై ఈ సందర్భంగా మాట్లాడుతూ గౌరవ మందకృష్ణ మాదిగ ఈనెల 7 తారీఖున ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అలంపూర్ పట్టణం కేంద్రంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లు కు రాబోయే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లోనే చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం మాదిగల విశ్వరూప మహాపాదయాత్రను చేపట్టడం జరిగింది.ఈ పాదయాత్రను జయప్రదం చేయడం కోసం మునుగోడు నియోజకవర్గం లోని ప్రతి మాదిగ ఇంటికి కరపత్రం చేరవేసే విధంగా సంఘీభావ పాదయాత్రను మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నిర్వహించబోతామని తెలియజేశారు. అంతేకాకుండా నవంబర్ 7న జరగబోయే మాదిగల విశ్వరూప మహాసభ కు నియోజకవర్గంలోని ప్రతి మాదిగ బిడ్డ తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బుషిపాక నరేష్ మాదిగ ఏ హెచ్ పి మండల కన్వీనర్ బుషిపాక యాదయ్య, సీనియర్ నాయకులు పల్లేటి యాదయ్య దామెర ఉపాధ్యక్షులు పూదరి ఎల్లయ్య పిల్లోమని బుషిపాక వెంకటయ్య నారపాక విజయ్ పూదరి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.