ఎన్నికల కోడ్ అమలుతో రాజకీయ వాల్ పోస్టర్లు తొలగింపు
నేరేడుచర్ల, అక్షిత న్యూస్:
సోమవారం ఎన్నికల షెడ్యూల్ ప్రకటనలతో కోడ్ అమల్లోకి రాగా నేరేడుచర్ల మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు రాజకీయ పార్టీల, నాయకుల వాల్ పోస్టర్లను మున్సిపల్ సిబ్బందితో సున్నాలు వేసి చెరిపివేశారు. పట్టణంలో, గ్రామంలో ఎక్కడైనా రాజకీయ నాయకులకు సంబంధించిన, రాజకీయ పార్టీలకు సంబంధించిన వాల్ పోస్టర్లు, గోడపై రాతలు ఉండకూడదని, డిసెంబర్ 5వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని, ప్రజలు ఎన్నికల నిబంధనలు పాటించాలని సూచించారు.