బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర స్థాయి జనరల్ బాడీ సమావేశాన్ని జయప్రదం చేయండి.

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర స్థాయి జనరల్ బాడీ సమావేశాన్ని జయప్రదం చేయండి.

బీసీ నేత ధనుంజయ నాయుడు విజ్ఞప్తి.

గరిడేపల్లి అక్షిత న్యూస్:

ఈనెల 15న హైదరాబాదు కాచిగూడ లోని మున్నూరు కాపు భవన్లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర జనరల్ బాడీ సమావేశం జరగనున్నదని అట్టి సమావేశాన్ని జయప్రదం చేయాలని బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా కమిటీ కన్వీనర్ ధూళిపాళ ధనుంజయ నాయుడు కోరారు.బుధవారం నాడు ఆయన గరిడేపల్లి మండల కేంద్రంలో విడుదల చేసిన పత్రికా ప్రకటనలో కోరినారు.రానున్న శాసనసభ ఎన్నికల్లో బీసీలు రాజ్యాధికారం కొరకు ప్రయత్నం చేయాలని అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 56 శాతం సీట్లు కేటాయించాలని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్య వేదిక ద్వారా ఎన్నికైన శాసనసభ్యులు బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని, ఆయన విజ్ఞప్తి చేశారు.ప్రతి సార్వత్రిక ఎన్నికలలో, ప్రతి శాసనసభ ఎన్నికల్లో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు బీసీలను మోసం చేస్తూనే ఉన్నాయని, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కొరకు దశాబ్దల తరబడి బీసీ సంక్షేమ సంఘం పోరాడుతున్నప్పటికీ పాలకులు పెడ చెవిలో పెడుతున్నారని కేంద్రంలో బీసీలకు బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, త్వరలో చేపట్టనున్న జనగణలలో కులగణ న చేపట్టి బీసీల సామాజిక ఆర్థిక రాజకీయ స్థితిగతులను పరిశీలన చేసి బీసీల అభ్యర్థికి పాలకులు చేపట్టాల్సిన పలు అంశాలపై పార్లమెంట్లో చర్చించి వారికి తగువిధంగా తోడ్పాటు అందించేవి దిశగా పాలకులు ఆలోచన చేయాలని ఆయన కోరారు.15వ తేదీ హైదరాబాదులో జరిగే బీసీ సంక్షేమ సంఘం సమావేశానికి జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ, సూర్యాపేట జిల్లా ఇన్చార్జ్ మోడేపల్లి కృష్ణమాచారి తదితరులు హాజరవుతారని జిల్లాస్థాయి బాధ్యులు సకాలంలో హాజరై విజయవంతం చేయాలని తన ప్రకటనలో కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking