మీడియా సెంటర్,కంట్రోల్ రూం ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్
నల్గొండ, అక్షిత ప్రతినిధి :
జిల్లా కలెక్టరేట్ జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం లో భారత ఎన్నికల సంఘం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యుల్ ప్రకటించిన సందర్భంగా బుధవారం మీడియా సెంటర్ ను,మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ ను జిల్లా కలెక్టర్,జిల్లా ఎన్నికల అధికారి అర్.వి.కర్ణన్ ప్రారంభించారు. మీడియా సెంటర్ ద్వారా ఎన్నికల సమాచారం మీడియాకు చేర వేయడానికి మీడియా సెంటర్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. మీడియా కవరేజ్ లో భాగంగా సంబంధిత అధికారులు మీడియా ప్రతినిధులతో సమన్వయం చేసుకొని రోజువారి సమాచారాన్ని అందజేస్తారని ఆయన అన్నారు.
ఎన్నికల సంబంధిత ప్రకటనలు,ప్రచారాలపై మీడియా సర్టిఫికేషన్ ఆండ్ మానిటరింగ్ కమిటీ గట్టి నిఘా పెట్టాలని అన్నారు. ప్రకటన ప్రచారానికి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలలో ఖర్చు విషయం మై రేట్ కార్డ్ ను పొంది ఆ ప్రకారం ఎప్పటి కప్పుడు సంబంధిత పార్టీ,అభ్యర్థుల ఖర్చు లో పొందు పరిచే విధంగా వ్యయ పరిశీలకునికి సమర్పించాలని అన్నారు.ఎన్నికల విధులు అత్యంత కీలకమయినవి, సమర్థవంతంగా నిర్వర్తించాలని అన్నారు.


తొలుత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల జిల్లా కంట్రోల్ రూం ను కలెక్టర్ ప్రారంభించారు.ఎన్నికల సంబంధించి టోల్ ఫ్రీ నంబర్ 1950 , కాల్ సెంటర్ 1800 425 1442 ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
జిల్లాలో ఎన్నికల నిర్వహణ,పిర్యాదులు కు సంబంధించి ఈ కాల్ సెంటర్ పనిచేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ కోటేశ్వర రావు,జిల్లా పౌర సంబంధాల అధికారి పి.శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేటిక్ ఆఫీసర్ గణపతి, కలెక్టరేట్ ఏఓ మోతీ లాల్, తదితరులు పాల్గొన్నారు.