రాబోయే ఎన్నికల బరిలో భారతీయ జనతా పార్టీ గెలుపు తథ్యం..

రాబోయే ఎన్నికల బరిలో భారతీయ జనతా పార్టీ గెలుపు తథ్యం..
రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్

శేరిలింగంపల్లి అక్షిత ప్రతినిధి:

గడపగడపకు బీజేపీ రవన్న ప్రజా యాత్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు లింగంపల్లి డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ సి బ్లాక్ నందు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు బలహీనపడుతుందని బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందని బీజేపీ అధికారంలోకి వస్తే బి.ఆర్.ఎస్ పార్టీ నాయకుల అవినీతి అక్రమాలు అన్ని బయటకి వస్తాయని అడ్రస్ గల్లంతైన కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేస్తున్నారని ఎద్దేవా చేశారు , వీళ్ళ డ్రామాలు ప్రజలకు తెలుసు, వారికి తగిన బుద్ధి చెప్తారన్నారు, శేర్లింగంపల్లి నియోజకవర్గం లో ప్రజల కోసం ,ప్రజా సమస్యలపై పోరాటం చేసేది , చేస్తుంది , ప్రజలకు అండగా ఉంది బీజేపీ ఒక్కటేనన్నారు, శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ప్రజలు భారతీయ జనతా పార్టీ పైపు ఉన్నారు , వారి ఆశీస్సులతో కాషాయం జెండా ఎగరవేయడం తథ్యం అన్నారు, గెలిచిన తరువాత అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు ,
ఈ కార్యక్రమంలో ఏళ్ళేష్ , అనిల్ కుమార్ యాదవ్ , రమేష్ , అనంత రెడ్డి , సంజీవ్ రెడ్డి, చంద్ర మోహన్ , రవీందర్ రెడ్డి , వెంకటేష్ ,గోపాల్ యాదవ్ ,గోపాల్ రెడ్డి, మధుసూధన్ రెడ్డి , రాజు, పద్మ , విజయ లక్ష్మి ,అరుణ , సుశీల , నాగులు, పార్వతి, ఆదిలక్ష్మి,వరలక్ష్మి, శివాసింగ్ , కార్యకర్తలు , అభిమానులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking