గాంధీ అంటే అంత చిన్న చూపా

గాంధీ అంటే అంత చిన్న చూపా

 

-తాత మధు నోరు అదుపులో పెట్టుకో

-ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు

-జిల్లాలో ఉన్న అధికారులను వెంటనే బదిలీ చేయాలి

-లేదంటే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం

-జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్

ఖమ్మం/ అక్షిత బ్యూరో :

ఖమ్మంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు ఏమ్మెల్సీ తాత మధు గాంధీని అవమానిస్తూ మాట్లాడడం సిగ్గుచేటని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ విమర్శించారు.పార్టీలో గాంధీ సిస్టం లేదు జెండాలు మోసనోడికి ప్రభుత్వ పథకాలు అని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. గురువారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు టిఆర్ఎస్ పక్షాన ఉన్నారని తాతా మధు మాటల్లో స్పష్టమవుతుందని తెలిపారు.సాధారణంగా ఎన్నికలకు ముందు అధికారులను బదిలీలు చేయాల్సి ఉందని కానీ ఎలక్షన్ నోటిఫికేషన్ రెండు నెలలకు ముందే కొంతమంది అధికారులను ప్రభుత్వం ప్రమోషన్ల పేరుతో తమ ఆధీనంలో ఉంచుకుందని ఎలక్షన్ సమయంలో బీఆర్ఎస్ కు అనుకూలంగా పనిచేసేందుకు అవకాశం ఉందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అడ్డదారిలో అధికారంలోకి రావాలని చూస్తుందని సాక్షాత్తు జిల్లా అధ్యక్షుడే మాటల్లోనే తేటతెల్లం అవుతుందని తెలిపారు.ఎలక్షన్ కమిషన్ దీన్ని సీరియస్ గా పరిగణించి వెంటనే జిల్లాలో ఉన్న ప్రభుత్వ అధికారులను మార్పులు చేర్పులు చేయాలని డిమాండ్ చేశారు.అనంతంరం నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ మాట్లాడుతూ ఎలక్షన్ కమీషన్ పై తమకి ఎంతో నమ్మకం ఉందని ఎన్నికలు సజావుగా జరగడానికి కాంగ్రెస్ పార్టీ తరపున పూర్తిగా సహకరిస్తామని అన్నారు. జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కి అనుకూలంగా పని చేసే అధికారులు చాలా మంది ఉన్నారని ఎన్నికల కమిషన్ వెంటనే వారిని బదిలీ చేసి వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఆయా హోదాలో ఉన్న అధికారులు అంతా పువ్వాడ అజయ్ ఏరీ కోరీ తెచ్చుకున్న అధికారులే అని వారందరినీ బదిలీ చేయాలని కోరారు.ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతతో ఎక్కడ అవినీతి జరిగిన ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయాలని చూసించారు.ఈ కార్యక్రమంలో వీరితో పాటు పాలేరు నియోజకవర్గ పి సి సి సభ్యులు రాయల నాగేశ్వరరావు జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు పులిపాటి వెంకయ్య రాష్ట్ర మైనారిటీ నాయకులు బి యచ్ రబ్బాని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య జిల్లా కిసాన్ కాంగ్రెస్ అద్యక్షులు మొక్కా శేఖర్ గౌడ్ జిల్లా మైనారిటీ అద్యక్షులు సయ్యద్ ముజాహిద్ హుస్సేన్ జిల్లా కాంగ్రెస్ నాయకులు మూడుముంతల గంగరాజు యాదవ్ మాజీ కౌన్సిలర్ పాలకుర్తి నాగేశ్వరావు ఖమ్మం నియోజకవర్గ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ ఏలూరి రవికుమార్ యువజన కాంగ్రెస్ నాయకులు అంజని కుమార్ బచ్చలికూర నాగరాజు యడవల్లి నాగరాజు మోహన్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking