గిరిజన ఆత్మీయ సమ్మేళనం

గిరిజన ఆత్మీయ సమ్మేళనం

వచ్చే ఎన్నికల్లో సుధీర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాము అని గిరిజన పెద్దలు హామీ ఇచ్చారు

ఎల్బీనగర్, అక్షిత ప్రతినిధి:

గురువారం వంగ శంకరమ్మ గార్డెన్స్ నందు జరిగిన గిరిజన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి .ఈ సందర్భంగా గిరిజన పెద్దలు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో సుధీర్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటాము అని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ 10 కోట్ల రూపాయల వ్యయంతో మీకు బంజారా భవన్ నిర్మించడం జరిగింది అని గుర్తు చేశారు.గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత సీఎం కే సీ ఆర్ అని తెలిపారు.

తెలంగాణలో ఎన్నికలు ఏమైనా విజయం బి ఆర్ ఎస్ పార్టీదే .రాష్ట్రంలో అన్ని సర్వేలు బి ఆర్ ఎస్ పార్టీకే అధికారాన్ని చూపిస్తున్నాయి .రాష్ట్రంలో మూడవసారి బి ఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యం అని తెలిపారు. తెలంగాణలో బిజెపి పార్టీకి ఉనికి లేదు ,కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ లేదని అన్నారు.2014లో రాష్ట్ర ప్రజలు ఉద్యమ నాయకుడిని పట్టం కట్టారని తెలిపారు. 9 ఏళ్లలో రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధించింది. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుంది అని తెలిపారు.రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శం .దేశం మొత్తంలో రెండుసార్లు రైతులకు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం కెసిఆర్ ప్రభుత్వం అని తెలిపారు.పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ పథకం ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్ దే అని తెలిపారు. వ్యవసాయానికి పెట్టుబడి సాయం చేసి రైతులను రాజును చేసిన ప్రభుత్వం కెసిఆర్ ప్రభుత్వం. పేద వర్గాల సంక్షేమం కోసం 200 రూపాయలు ఉన్న పింఛన్ను 2000 రూపాయలకు పెంచడంతో పాటు రాష్ట్రంలో 45 లక్షల మందికి ఆసరా పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం బి ఆర్ ఎస్ ప్రభుత్వం .6 ఏండ్లలో 65 వేల కోట్ల పెట్టుబడి సాయం అందించిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. కాంగ్రెస్, బిజెపిలు రాష్ట్రంలో అధికారం కోసమే పాకులాడుతున్నాయే కానీ తెలంగాణ అభివృద్ధి కోసం మాత్రం కాదు అని తెలిపారు. కావున కేసీఆర్ ప్రభుత్వ పాలనను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు .తనను మరోసారి ఆశీర్వదించి అసెంబ్లీకి పంపాలని విజ్ఞప్తి చేశారు. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి మరియు పలువురు గిరిజన పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking