ఖమ్మంలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన పల్లా కిరణ్
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
ఖమ్మం నగరంలో బుధవారం శాంతినగర్ మిషన్ హాస్పిటల్ ప్రాంగణములో పేదల పక్షపాతి పీడిత ప్రజల నాయకులు పల్లా జాన్ రాములు 85 వ జయంతి సందర్భంగా ఐదు రోజుల ఉచిత వైద్య శిబిరంలో భాగంగా మొదటిరోజు కార్యక్రమాన్ని పల్లా కిరణ్ కుమార్ ప్రారంభించారు.

అనంతరం పల్లా జాన్ రాములు చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి ఒక నిమిషం మౌనం పాటించారు.ఈ ఉచిత వైద్య శిబిరములో పెద్దలకు ప్రముఖ వైద్యులచే జ్వరము దగ్గు జలుబు బిపి షుగర్ ముఖ్యముగా చిన్న పిల్లలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలను నిపుణులైన వైద్యులచే వైద్యం చేయించి సంబంధించిన మందులను ఉచితంగా అందజేశారు. సుమారుగా పెద్దలు చిన్నలు 300 మంది దాకా పాల్గొని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో డాక్టర్లు రఘు చందన సాయి సంపత్ కృష్ణ మిషన్ హాస్పిటల్ మేనేజర్ కృష్ణకుమారి చిలకబత్తిని కనకయ్య స్పందన లక్ష్మి సుజాత అబ్రహం సత్యనారాయణ గిరి జగన్ సురేష్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.